యేలేటి బ్రెయిన్.. ప్రదీప్ ఎనర్జీ.. మ్యాజిక్ వర్కౌట్ అయ్యేనా?
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడు ఎలాంటి కాంబినేషన్ సెట్ అవుతుందో ఎవరూ ఊహించలేరు.
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడు ఎలాంటి కాంబినేషన్ సెట్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. కోమలి లాంటి సినిమాతో డైరెక్టర్ గా సక్సెస్ చూసి, ఆ తర్వాత లవ్ టుడే మూవీతో యాక్టర్ గా యూత్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ కి దర్శకుడిగా చంద్రశేఖర్ యేలేటి పేరు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రేపో మాపో అఫీషియల్ గా క్లారిటీ కూడా ఇవ్వనున్నారు.
ప్రదీప్ ఇమేజ్ కి, యేలేటి మేకింగ్ కి అస్సలు సంబంధం లేదు. లవ్ టుడే, డ్యూడ్ లాంటి ప్రాజెక్ట్స్ చూస్తే ప్రదీప్ ఎంత ఎనర్జిటిక్ గా ఉంటాడో తెలుస్తుంది. రొమాంటిక్ కామెడీలతో జనాలను ఎంటర్టైన్ చేయడం అతనికి బాగా తెలుసు. మరోపక్క ఐతే, అనుకోకుండా ఒక రోజు లాంటి కల్ట్ క్లాసిక్స్ తో యేలేటిది కంప్లీట్ సపరేట్ ట్రాక్. ఇలాంటి డిఫరెంట్ స్కూల్స్ కలిపి ఇప్పుడు ఒక ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
డైరెక్టర్ గా యేలేటి ట్రాక్ రికార్డ్ ని కాస్త గమనిస్తే.. ఆయన దగ్గర ఎప్పుడూ అద్భుతమైన కంటెంట్ ఉంటుంది అన్న పేరు ఇండస్ట్రీలో చాలా బలంగా ఉంది. కథ చెప్పే విధానం, స్క్రీన్ ప్లే టెక్నిక్స్ చాలా కొత్తగా ఉంటాయి. కానీ కమర్షియల్ లెక్కలు చూసుకుంటే ఆయన ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్స్ పెద్దగా కనిపించవు. కంటెంట్ ని రెగ్యులర్ మాస్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా ప్యాక్ చేయడంలో ఆయన కాస్త వెనుకబడ్డారు అనే టాక్ ఉంది.
గోపీచంద్ హీరోగా చేసిన సాహసం సినిమా ఆయన కెరీర్ లోనే ఒక భారీ బడ్జెట్ ప్రాజెక్ట్. ట్రెజర్ హంట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఆ అడ్వెంచర్ మూవీకి ఇప్పటికీ టీవీల్లో, ఆన్లైన్ లో ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని నితిన్ తో చేసిన చెక్ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఆ ఫెయిల్యూర్ తర్వాత ఆయన మరింత టైమ్ తీసుకుని ఇప్పుడు ఈ కొత్త యాక్షన్ కథతో సెట్స్ పైకి రాబోతున్నారు.
వరుస పరాజయాలు ఉన్నప్పటికీ యేలేటి కంటెంట్ ని నమ్మి మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. నిర్మాణంలో ఏమాత్రం రాజీ పడని ఈ బ్యానర్ తోడవ్వడం ప్రాజెక్ట్ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయట. సెప్టెంబర్ నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడానికి మేకర్స్ పక్కాగా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు.
నిజంగా ఇదొక క్రేజీ కాంట్రాస్ట్ కాంబో అని కచ్చితంగా చెప్పొచ్చు. లాజిక్స్ తో మైండ్ గేమ్స్ ప్లే చేసే యేలేటి బ్రెయిన్ కి, స్క్రీన్ మీద హైపర్ యాక్టివ్ గా ఉండే ప్రదీప్ ఎనర్జీ కలిస్తే థియేటర్లలో ఔట్ పుట్ ఎలా ఉంటుందో చూడాలి. దర్శకుడి ఇంటెన్స్ కంటెంట్ కి హీరో యూత్ క్రేజ్ కరెక్ట్ గా తోడైతే కమర్షియల్ గా ఇద్దరికీ కావాల్సిన ఒక సాలిడ్ హిట్ దొరికే ఛాన్స్ ఉంటుంది. మరి ఈసారి చంద్రశేఖర్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.