విజయ్ కొడుకు మాస్ టచ్.. సిగ్మాకు సులోచన కలిసొచ్చేనా?

సందీప్ కిషన్ లీడ్ రోల్ లో నటిస్తున్న సిగ్మా సినిమాపై ఇప్పటికే మంచి హైప్ ఉన్న విషయం తెలిసిందే.

Update: 2026-09-26 03:26 GMT

సందీప్ కిషన్ లీడ్ రోల్ లో నటిస్తున్న సిగ్మా సినిమాపై ఇప్పటికే మంచి హైప్ ఉన్న విషయం తెలిసిందే. విజయ్ దళపతి కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఆ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతున్నాయి. లేటెస్ట్ గా సినిమా నుంచి విడుదలైన స్పెషల్ సాంగ్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఇందులో కేథరిన్ థ్రెసా కనిపించిన తీరు పాటకు స్పెషల్ అట్రాక్షన్ గా మారింది.




 


సులోచనా అంటూ సాగే ఆ సాంగ్ ను మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. సినిమాలోని కథ, యాక్షన్ ఎలిమెంట్స్‌ తో పాటు కమర్షియల్ టచ్ ఉండేలా ఆ పాటను రూపొందించినట్లు తెలుస్తోంది. కేథరిన్ థ్రెసా స్పెషల్ అప్పియరెన్స్‌ తో పాటకు మరింత స్టైలిష్ లుక్ వచ్చింది. ఆమె వేసిన డ్యాన్స్ స్టెప్పులు, స్క్రీన్‌పై కనిపించిన గ్లామర్ ఆ సాంగ్‌ లో మెయిన్ అట్రాక్షన్ గా నిలిచాయి.

సాంగ్ మొదలైన దగ్గర నుంచి ఎనర్జిటిక్ బీట్‌ తో సాగుతుంది. సాంగ్‌ కు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించగా.. శృతి రంజని ఆలపించారు. కృష్ణ చైతన్య సాహిత్యం అందించారు. తమన్ అందించిన బీట్‌కు తగ్గట్టుగా డ్యాన్స్ మూమెంట్స్‌ ను డిజైన్ చేశారు. సందీప్ కిషన్ సినిమాల్లో ఉండే కమర్షియల్ ఎలిమెంట్స్‌ కు తగ్గట్టుగా ఆ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చినట్లు కనిపిస్తోంది.

ఇక సిగ్మా మూవీ విషయానికి వస్తే.. హై-వోల్టేజ్ యాక్షన్, అడ్వెంచర్, హీస్ట్ కామెడీ ఎలిమెంట్స్ తో సినిమా తెరకెక్కింది. ఒక భారీ దోపిడీ చుట్టూ కథ తిరుగుతుందని ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ద్వారా క్లారిటీ వచ్చింది. అయితే కథను దర్శకుడు జేసన్ సంజయ్ ఏ విధంగా సిల్వర్ స్క్రీన్ పై తీసుకొచ్చారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.

సందీప్ కిషన్ ఇందులో కొత్త తరహా పాత్రలో కనిపించనున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించారు. ఆమె రోల్ రేడియో జాకీగా ఉంటుందని సమాచారం. సంపత్ రాజ్, రాజు సుందరం, శివ్ పండిట్, అన్బు థౌసన్, యోగ జాపీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. విజయ్ దళపతి కుమారుడు దర్శకుడిగా పరిచయం అవుతుండటం ఆ సినిమాకు మొదటి నుంచి స్పెషల్ అట్రాక్షన్ గా మారింది.

స్టార్ హీరో కొడుకుగా కాకుండా దర్శకుడిగా జేసన్ సంజయ్ తన మార్క్ చూపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చెబుతోంది. ఇప్పుడు సులోచనా పాటలో కేథరిన్ థ్రెసా సందడి చేయడంతో సినిమాకు మరో కమర్షియల్ ఎలిమెంట్ యాడ్ అయినట్టయింది. లైకా ప్రొడక్షన్స్‌ పై సుభాస్కరన్ నిర్మించిన ఆ సినిమా అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుంది. తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తుండగా.. సీడెడ్‌ లో ఎన్‌వీఆర్ సినిమా రిలీజ్ చేస్తోంది. రిలీజ్ కు ముందు వచ్చిన సులోచనా సాంగ్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేలా ఉంది.


Full View


Tags:    

Similar News