భార్య‌కు ఇష్టం లేద‌ని తాప్సీని త‌ప్పించిన హీరో!

టాలీవుడ్ టూ బాలీవుడ్ తాప్సీ ప్ర‌యాణం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగు ప‌రిశ్ర‌మ‌లో అనుకున్నంత‌గా స‌క్సెస్ కాలేక‌పోయినా? బాలీవుడ్ లో మాత్రం బిజీగానే సినిమాలు చేస్తోంది.

Update: 2026-09-26 03:15 GMT

టాలీవుడ్ టూ బాలీవుడ్ తాప్సీ ప్ర‌యాణం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగు ప‌రిశ్ర‌మ‌లో అనుకున్నంత‌గా స‌క్సెస్ కాలేక‌పోయినా? బాలీవుడ్ లో మాత్రం బిజీగానే సినిమాలు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా అమ్మ‌డు కెరీర్ జ‌ర్నీలో ఎదురైన ఓ చేదు అనుభ‌వాన్ని గుర్తు చేసుకుంది. గతంలో ఓ సినిమా కోసం డేట్లు ఇచ్చినా? ఎలాంటి సరైన వివరణ లేకుండానే ఆ ప్రాజెక్ట్ నుంచి ఎలా తొలగించారో వివరించింది. అంతే కాదు ఆ సినిమా నుండి తీసివే యడానికి చెప్పిన ఓ దారుణమైన కారణాన్ని కూడా గుర్తు చేసుకుంది.

సినిమా రంగంలో నెపోటిజం , అభద్రతా భావాలు ఏ విధంగా పనిచేస్తాయో టాప్సీ మాటల్లో వెల్లడించింది. ఒక చిత్రానికి సంబంధించి కాల్‌షీట్స్ కేటాయించిన తర్వాత కూడా ఆ చిత్ర హీరో తనను సినిమా నుంచి తప్పించాడని తెలిపింది. దీని వెనుక హీరోకు ఉన్న అభద్రతా భావం అయి ఉండవచ్చని లేదా తనకు బాగా తెలిసిన వేరొక నటిని ఆ పాత్రలో తీసుకోవాలనే ఉద్దేశం అయి ఉండవచ్చని టాప్సీ అభిప్రాయపడింది. కానీ తనను ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించినందుకు మాత్రమే తనను బయటకు పంపారని తప్ప మరే ఇతర సరైన కారణాన్ని చిత్రబృందం చెప్పలేదని పేర్కొంది.

తనను ఒక సినిమా నుంచి తప్పించే క్రమంలో చెప్పిన వికారమైన సాకు గురించి తాప్సీ ఓపెన్ అయింది. `ఆ హీరో భార్యకు నీవంటే అస్సలు ఇష్టం లేదు. అందుకే నిన్ను సినిమా నుంచి తీసేస్తున్నాం` అని మేకర్స్ చెప్పారని వెల్లడించింది. అసలు ఆ హీరో భార్యకు తనపై ఎందుకు అంత అయిష్టత ఉందో కూడా తనకు అర్థం కాలేదని తాప్సీ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఆ విధంగా వ్యవహరించిన హీరో ఎవరు? ఆయన భార్య ఎవరు?

అనే వివరాలను మాత్రం తాప్సీ బయటపెట్టలేదు.

నటిగా ఎదుగుతున్న సమయంలో ఒకే రకమైన పాత్రలకే పరిమితం కాకుండా ఉండటానికి తాను ఎంతో జాగ్రత్త పడుతున్నట్లు తెలిపింది. పరిశ్రమలో గ్లామర్ పాత్రల కోసం ఐదుగురు నటీమణులు, సామాజిక అంశాల ఆధారిత పాత్రల కోసం మరో ఐదుగురు నటీమణులనే ఎంచుకునే మూస ధోరణి ఉందని విమర్శించింది. ఇలాంటి విధానానికి భిన్నంగా వెళ్లాలనే ఉద్దేశంతోనే తాను కొన్ని సినిమాలను తిరస్కరించాల్సి వచ్చిందని తెలిపింది.

క్లైమాక్స్ లేదా కథాంశం ప్రేక్షకులు ముందే ఊహించేలా ఉండే రొటీన్ సినిమాల్లో నటించడం తనకు ఇష్టం లేదంది. `ఇలాంటి కథల్లో నన్ను తీసుకోవద్దు. ఇది మీ సినిమాకే నష్టం కలిగిస్తుంది` అని స్వయంగా దర్శక, నిర్మాతలకు చెప్పి మరీ కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నట్లు పేర్కొంది. ఒక నటిగా తన పరిధిని విస్తరించుకోవడానికి, ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందించడానికే ప్రాధాన్యత ఇస్తున్నానని తెలిపింది.

Tags:    

Similar News