సంపూ కాంట్రవర్సీ.. జర్నలిస్ట్ రెస్పాన్స్ ఏంటంటే?
నేచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా నటుడు సంపూర్ణేష్ బాబు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.
నేచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా నటుడు సంపూర్ణేష్ బాబు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. సీనియర్ సినీ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ అడిగిన కొన్ని ప్రశ్నలు సంపూర్ణేష్ ను కించపరిచేలా ఉన్నాయంటూ నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆ వ్యవహారంపై నాగేంద్ర కుమార్ ఇప్పుడు రెస్పాండ్ అయ్యారు.
సోషల్ మీడియాలో విమర్శలు పెరగడంతో నాగేంద్ర కుమార్ ఓ వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. సంపూర్ణేష్ బాబుతో తనకు చాలా ఏళ్లుగా ఫ్రెండ్ షిప్, మంచి రిలేషన్ ఉందని చెప్పారు. ఆ చనువు కారణంగా ఇంటర్వ్యూను కాస్త సరదాగా, ఎంటర్టైనింగ్ గా కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో కొన్ని కామెంట్స్ చేశానని వివరించారు. సంపూర్ణేష్ ను కించపరచడం లేదా అవమానించడం తన ఉద్దేశం కాదని క్లారిటీ ఇచ్చారు.
సంపూర్ణేష్ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, ఆయనలోని హ్యుమానిటీ యాంగిల్ తనకు ఎంతో ఇష్టమని నాగేంద్ర కుమార్ తెలిపారు. తన కామెంట్స్ వల్ల సంపూర్ణేష్ అభిమానులు, ప్రేక్షకులు బాధపడి ఉంటే ఓపెన్ గా క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. తన 40 ఏళ్ల జర్నలిజం జర్నీలో ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదని చెప్పారు. అంతకుముందు ఆ వ్యవహారంపై సంపూర్ణేష్ బాబు కూడా స్పందించారు.
నాగేంద్ర కుమార్ తనకు చాలా క్లోజ్ అయిన వ్యక్తి అని తెలిపారు. హృదయ కాలేయం సినిమా నుంచి తనకు సపోర్ట్ గా నిలిచిన జర్నలిస్టుల్లో ఆయన కూడా ఒకరని గుర్తుచేశారు. తమ మధ్య ఉన్న క్లోజ్ నెస్ కారణంగానే ఆయన అలా మాట్లాడి ఉంటారని చెప్పారు. తన అభిమానులు ఆ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని సంపూర్ణేష్ కోరారు. ఇంటర్వ్యూలో ఏదో ఫ్లో లో ఓ మాట దొర్లిందని, దాన్ని తాను తప్పుగా భావించడం లేదని క్లారిటీ ఇచ్చారు. నాగేంద్ర అన్న తనకు చాలా క్లోజ్ అని, తమ మధ్య ఉన్న రిలేషన్ అలాంటిదని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. ది ప్యారడైజ్ ప్రమోషన్లలో జరిగిన ఆ ఇంటర్వ్యూలో నాగేంద్ర కుమార్ అడిగిన కొన్ని ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సినీ బ్యాక్ డ్రాప్ లేకపోయినా హీరో కావాలనుకోవడం, తనలో ఏం చూసుకుని హీరోగా రావాలనుకున్నారనే విషయాలపై ఆయన ప్రశ్నలు అడిగారు. ది ప్యారడైజ్ లాంటి పెద్ద సినిమాలో అవకాశం ఎలా వచ్చిందనే యాంగిల్ లోనూ మాట్లాడారు. ఆ ప్రశ్నలపై కొందరు నెటిజన్లు ఫైర్ అయ్యారు.
ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా హార్డ్ వర్క్ తో గుర్తింపు తెచ్చుకున్న నటుడిని అలా ప్రశ్నించడం సరికాదంటూ కామెంట్లు చేశారు. ముఖ్యంగా పర్సనల్ విషయాలు ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే సంపూర్ణేష్ మాత్రం ఆ వ్యవహారాన్ని పెద్ద వివాదంగా చూడలేదు. తనకు నాగేంద్ర కుమార్ తో ఉన్న రిలేషన్ ను ప్రస్తావిస్తూ అభిమానులు కూడా దీనిని మరోలా అర్థం చేసుకోవద్దని కోరారు. ఇప్పుడు నాగేంద్ర కుమార్ క్లారిటీతో ఆ ఇంటర్వ్యూ చుట్టూ మొదలైన వివాదం మలుపు తిరిగింది.