KAAKA పై బిగ్ అప్‌డేట్ చెప్పిన చిరు

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై టాలీవుడ్‌లో అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.

Update: 2026-09-26 04:28 GMT

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై టాలీవుడ్‌లో అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్‌గా #KAAKA అనే పేరు వినిపిస్తోంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. మునుపటి సినిమాల కంటే చిరును మరింత స్టైలిష్‌గా, డిఫరెంట్ మాస్ యాంగిల్‌లో బాబి చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

సందీప్ కిషన్ `సిగ్మా` ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి.. తన తదుపరి చిత్రం #KAAKA షూటింగ్ విశేషాలపై బిగ్ అప్ డేట్ ఇచ్చారు. నేరుగా షూటింగ్ స్పాట్ నుంచే ఈ వేడుకకు వచ్చానని చెప్పిన చిరు సినిమా పురోగతిపై బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. కాకా ఫస్ట్ హాఫ్ షూటింగ్ పూర్తయిందని, సెకండ్ హాఫ్ కూడా ఇప్పటికే 30 శాతం కంప్లీట్ అయినట్లు మెగాస్టార్ స్వయంగా వెల్లడించారు. ఓవ‌రాల్ గా 80శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి కాగా ఇంకా 20శాతం మాత్ర‌మే పెండింగ్ ఉంది.

ఈ సందర్భంగా సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్‌పై చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ హాఫ్ అవుట్‌పుట్ తమన్ చేతిలో ఉందని.. అత‌డు దానిని తీసుకుని అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (బీజీఎం) రెడీ చేస్తున్నారని తెలిపారు. తమన్ ఎప్పుడూ తన మనసులోనే ఉంటాడని.. అత‌డు ఇచ్చిన ప్రామిస్ ప్రకారం ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయమని మెగాస్టార్ ధీమా వ్యక్తం చేశారు.

యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే చిరంజీవి.. ఈ ఈవెంట్ వేదికగా `సిగ్మా` యూనిట్ కష్టాన్ని కొనియాడారు. షూటింగ్ రద్దు చేసుకుని రెస్ట్ తీసుకోవచ్చని చిత్ర బృందం చెప్పినా.. యువతను ఉత్సాహపరచడమే తన బాధ్యతగా భావించి ఈ కార్యక్రమానికి హాజరైనట్లు ఆయన తెలిపారు. చిరులో ఉన్న ఈ నిరంతర ఉత్సాహం.. సినిమాపై ఆయన చూపే అంకితభావం ప్రతిసారీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

అన్ని కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసుకుని.. అనుకున్న ప్రకారం వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా #KAAKA చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మెగాస్టార్ స్పష్టం చేశారు. మంచి జోష్‌తో సాగుతున్న ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి రేసులో నిలిచి మరో మెగా బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.




Tags:    

Similar News