బాహుబలి కంటే డబుల్ గ్యాప్.. నాగ్ అశ్విన్ క్రేజీ స్కెచ్!

బాక్సాఫీస్ ని షేక్ చేసిన కల్కి మొదటి భాగం వచ్చి అప్పుడే రెండేళ్లు అయిపోయింది.

Update: 2026-06-25 12:00 GMT

బాక్సాఫీస్ ని షేక్ చేసిన కల్కి మొదటి భాగం వచ్చి అప్పుడే రెండేళ్లు అయిపోయింది. జూన్ 2024లో రిలీజ్ అయిన ఆ సినిమా తర్వాత, పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా అని అంతా వెయిట్ చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ కి బోర్ కొట్టకుండా, వాళ్ళ క్యూరియాసిటీని అలాగే మెయింటైన్ చేసేలా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఒక క్రేజీ ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది. దీని గురించి ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా ఈ న్యూస్ మాత్రం బాగా వైరల్ అవుతోంది.

గతంలో బాహుబలి మొదటి భాగానికి, రెండో భాగానికి మధ్య దాదాపు 21 నెలల గ్యాప్ వచ్చింది. ఆ టైమ్ లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ఒక్క పాయింట్ తోనే జనాలు వెయిట్ చేశారు. ఇప్పుడు కల్కి 2 సినిమాను 2027 డిసెంబర్ లో రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అంటే దాదాపు మూడున్నరేళ్ల గ్యాప్ వస్తుంది. బాహుబలితో పోలిస్తే ఇది డబుల్ గ్యాప్. ఇంత టైమ్ లో సినిమా మీద హైప్ పడిపోకుండా చూసుకోవడం టీమ్ కి చాలా అవసరం.

అందుకే ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి వైజయంతీ మూవీస్ ఒక స్పెషల్ ప్లాన్ వేసిందట. కల్కి ప్రపంచంలో జనాలకు బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్స్ తో ఓటీటీలో స్పెషల్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్కో ఎపిసోడ్ గంట సేపు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్, అలాగే సాయి పల్లవి చేసిన సుమతి క్యారెక్టర్ల బ్యాక్ స్టోరీస్ ని ఈ సిరీస్ లో చూపించబోతున్నారని గట్టిగా టాక్ వినిపిస్తోంది.

పార్ట్ 1 ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడికి ఈ క్యారెక్టర్స్ ఎలా వచ్చాయి అనేది ఈ ఓటీటీ ఎపిసోడ్స్ లో క్లియర్ గా చూపిస్తారట. దీనివల్ల థియేటర్లో పార్ట్ 2 చూసేటప్పుడు స్టోరీ ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఆడియన్స్ ని డైరెక్ట్ గా మెయిన్ సినిమాకు కనెక్ట్ చేయడానికి ఇదొక పర్ఫెక్ట్ బ్రిడ్జ్ లాగా పని చేస్తుంది. ఇలా చేస్తే సినిమా మీద ఇంట్రెస్ట్ తగ్గదు, పైగా పార్ట్ 2 కి వెళ్లేలోపు బజ్ ఇంకా పెరుగుతుంది.

హాలీవుడ్ మార్వెల్ సినిమాల్లో ఇలాంటివి చాలానే వచ్చాయి. ఇప్పుడు తెలుగులో కూడా ఓటీటీ కంటెంట్ ని థియేటర్ ఎక్స్పీరియన్స్ తో కలపడం ఒక కొత్త ట్రెండ్ లాగా మారుతోంది. కల్కి లాంటి భారీ యూనివర్స్ కి ఈ స్టైల్ కరెక్ట్ గా సెట్ అవుతుంది. జనాలు ఈ స్టోరీని మర్చిపోకుండా ఉండాలంటే మధ్యలో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కచ్చితంగా ఉండాలి.

వచ్చే ఏడాది ఏప్రిల్ కల్లా కల్కి 2 షూటింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత మొత్తం వీఎఫ్ఎక్స్ పనుల మీద టీమ్ ఫోకస్ పెడుతుందట. ఆలోపు ఈ స్పిన్ ఆఫ్ సిరీస్ లు సోనీ లివ్ లోకి వస్తే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు. అసలు ఈ వెబ్ సిరీస్ ల వార్త మీద మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి. నాగ్ అశ్విన్ వేస్తున్న ఈ స్కెచ్ వర్కౌట్ అయితే మాత్రం ఇదొక గేమ్ ఛేంజర్ అవుతుంది.

Tags:    

Similar News