అలాంటి జబ్బుతో బాధపడుతున్న ప్రముఖ హీరో.. ఎట్టకేలకు క్లారిటీ!
విష్ణు విశాల్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో అసలు విషయాన్ని బయటపెట్టారు.ఇటీవల నా ఫేస్ కాస్త టైర్డ్‌గా, ఉబ్బినట్టుగా కనిపిస్తోందని చాలా మంది గమనించారు.
కోలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు విశాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితుడే. వైవిధ్యమైన సినిమాలతో పాటు మన హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలను పెళ్లి చేసుకుని ఇక్కడ మరింత పాపులర్ అయ్యారు. అయితే గత కొన్ని రోజులుగా ఆయన హెల్త్ కండిషన్‌పై సోషల్ మీడియాలో రకరకాల రూమర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విష్ణు విశాల్ స్వయంగా స్పందిస్తూ, తాను గత మూడు, నాలుగు సంవత్సరాలుగా ఒక ప్రమాదకరమైన 'ఆటో ఇమ్యూన్' వ్యాధితో పోరాడుతున్నట్లు ఎమోషనల్ నోట్ షేర్ చేసి అందరినీ షాక్‌కి గురిచేశారు.
మూడేళ్లుగా ఆటో ఇమ్యూన్ జబ్బుతో పోరాటం:
విష్ణు విశాల్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో అసలు విషయాన్ని బయటపెట్టారు.ఇటీవల నా ఫేస్ కాస్త టైర్డ్‌గా, ఉబ్బినట్టుగా కనిపిస్తోందని చాలా మంది గమనించారు.. అసలు విషయం ఏంటంటే, నేను గత 3-4 సంవత్సరాలుగా ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్‌తో ఫైట్ చేస్తున్నాను.దీనికోసం డాక్టర్లు ఇచ్చిన కొన్ని హెవీ మెడిసిన్స్ వాడుతున్నాను. ఇక ఆ మందుల సైడ్ ఎఫెక్ట్స్ వల్లే నా ముఖం, కడుపు ఉబ్బరంగా కనిపిస్తున్నాయి" అని విష్ణు విశాల్ క్లారిటీ ఇచ్చారు.
అనారోగ్యంలోనూ తగ్గని సినిమా బాధ్యత:
ఆరోగ్యం సహకరించకపోయినా, మెడికల్ ట్రీట్‌మెంట్ తీసుకుంటూనే విష్ణు విశాల్ తన కొత్త సినిమా ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు. నాకు ఆరోగ్యం ముఖ్యం..అందుకే ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, అయినప్పటికీ నాపై మీరు చూపిస్తున్న ప్రేమ, నా సినిమా 'గట్ట కుస్తీ 2' కోసం రాత్రింబవళ్లు కష్టపడిన టీమ్ పట్ల ఉన్న బాధ్యత నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. ఇక అందుకే నేను ప్రమోషన్స్ కోసం మీ ముందుకు వస్తున్నాను" అని ఈ హీరో చెప్పుకొచ్చారు.
జూలై 3న థియేటర్లలో 'గట్ట కుస్తీ 2':
ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ల చివరి వారంలో ఉన్నానని, ఎంతో పాజిటివ్ ఎనర్జీతో ఉన్నానని విష్ణు విశాల్ తెలిపారు. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతున్న 'గట్ట కుస్తీ 2' మూవీ ని ప్రేక్షకులు థియేటర్లలో చూసి ఆదరించాలని ఆయన ఎదురుచూస్తున్నారు. ఇక అభిమానులు చూపించిన కేరింగ్, పంపిన మెసేజ్‌లు తనను మరింత జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రోత్సహించాయని, అందరికీ థాంక్స్ అని ఎమోషనల్ అయ్యారు.
విష్ణు విశాల్ పెట్టిన ఈ షాకింగ్ పోస్ట్ చూసి సినీ ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు. అంత పెద్ద జబ్బుతో బాధపడుతున్నా కూడా బాధ్యతగా సినిమా ప్రమోషన్లకు రావడం ఆయన డెడికేషన్‌కు నిదర్శనం అని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఇక ఈ ట్యాలెంటెడ్ హీరో త్వరగా కోలుకోవాలని, జూలై 3న రాబోతున్న 'గట్ట కుస్తీ 2' సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని మనమూ మనస్ఫూర్తిగా కోరుకుందాం.