• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సంక్రాంతిని వదిలేసిన...

సంక్రాంతిని వదిలేసిన 'సామాన్యుడు' .. రిపబ్లిక్ డే ఫైనల్!

By - Tupaki Desk
Update: 2022-01-07 03:53 GMT
కోలీవుడ్ లో మాస్ యాక్షన్ హీరోగా విశాల్ కి మంచి క్రేజ్ ఉంది. అజిత్ - విజయ్ వంటి మాస్ ఫాలోయింగ్ విపరీతంగా ఉన్న స్టార్ హీరోల నుంచి, సూర్య - ధనుశ్ వంటి విలక్షణమైన స్టార్ ల నుంచి ఆయన అక్కడ పోటీని తట్టుకుని తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఇక మొదటి నుంచి కూడా విశాల్ తన సినిమాలను తమిళంతో పాటు తెలుగులోను విడుదలయ్యేలా చూసుకుంటున్నాడు. అందువలన తెలుగులోను ఆయనకి మంచి క్రేజ్ ఉంది .. మంచి మార్కెట్ కూడా ఉంది. విశాల్ ను తెలుగు హీరో మాదిరిగానే ప్రేక్షకులు భావిస్తుంటారు. కంటెంట్ ఏ మాత్రం బాగున్నా హిట్ కట్టబెట్టేస్తుంటారు.

తమిళంలో ఆయన తాజా చిత్రంగా 'వీరమే వాగై సూదుమ్' అనే సినిమా చేశాడు. ఇది కూడా యాక్షన్ .. ఎమోషన్ సమపాళ్లలో కలిగిన సినిమానే. విశాల్ సొంత బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి శరవణన్ దర్శకత్వం వహించాడు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో కథానాయికగా డింపుల్ హయతి కనువిందు చేయనుంది. ఈ సినిమాను 'సామాన్యుడు' టైటిల్ తో తెలుగులో ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. సంక్రాంతి బరిలో ఈ సినిమాను నిలపడానికి విశాల్ గట్టి ప్రయత్నమే చేశాడు.

అయితే తమిళనాట థియేటర్స్ మూతబడుతుండటంతో అజిత్ 'వలిమై' వంటి సినిమాలే వాయిదా పడిపోయాయి. అలా విశాల్ సినిమా కూడా వాయిదా పడక తప్పలేదు. తమిళంతో పాటే తెలుగులోను ఈ సినిమా వాయిదా పడింది. అయితే ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమా టీమ్ తదుపరి రిలీజ్ డేట్ ను ప్రకటించేసింది. ఈ నెల 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెబుతూ, ఈ రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను వదిలారు. అప్పటికి కరోనా తీవ్రత తగ్గుతుందని వాళ్లు భావిస్తున్నారు.

ఇక కథానాయిక డింపుల్ హయతి విషయానికి వస్తే తెలుగు ప్రేక్షకులకు ఆమె పెద్దగా పరిచయం లేదు. గతంలో 'గద్దలకొండ గణేశ్ లో ఒక సాంగ్ లో మెరిసింది అంతే. తాజాగా రవితేజ 'ఖిలాడి' సినిమాలో మాత్రం రెండవ కథానాయికగా సందడి చేయడానికి రెడీ అవుతోంది ఈ సినిమా విడుదల తరువాత ఈ అమ్మాయికి మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చేనెల 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రవితేజ సినిమాతో పాటు విశాల్ సినిమాపై కూడా ఆమె బలమైన ఆశలు పెట్టుకుంది. సామాన్యుడి సహనాన్ని పరీక్షిస్తే ఎంతకైనా తెగిస్తాడు అని చెప్పే ఈ కథాంశం, విశాల్ కి విజయాన్ని తెచ్చిపెడుతుందేమో చూడాలి మరి.


Tags:    
  • Vishal 
  • Saamanyudu 
  • Dimple Hayathi 
  • Yuvan Shankar Raja 
  • Saravanan 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS