• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సాహో దెబ్బ‌కు సైరా...

సాహో దెబ్బ‌కు సైరా వ‌ద్దంటున్నారు

By - Tupaki Desk
Update: 2019-09-08 04:26 GMT
సాహో సినిమా బాగా ఆడాల‌ని సైరా టీం గ‌ట్టిగా కోరుకుని ఉంటే ఆశ్చ‌ర్యం లేదు. ఎందుకంటే దీన్ని కూడా సాహో త‌ర‌హాలోనే పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు. హిందీ - త‌మిళం - మ‌ల‌యాళం - క‌న్న‌డ భాష‌ల్లో పెద్ద ఎత్తున విడుద‌ల‌కు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు - క‌ర్ణాట‌క వ‌ర‌కు ఈ చిత్రానికి ఢోకా లేదు. బిజినెస్ భారీగానే జ‌రుగుతోంది. కానీ మిగ‌తా చోట్ల ఆశాజ‌న‌కంగా లేదు. బిజినెస్ ఆఫ‌ర్లు కోరుకున్న‌ట్లుగా లేవు. సాహో సినిమా హిందీలో బాగా ఆడినా.. చిరంజీవికి అక్క‌డ చెప్పుకోద‌గ్గ పేరు - గుర్తింపు లేవు. ఎప్పుడో 90ల్లో ఒక‌ట్రెండు సినిమాలు చేశాడు కానీ.. ఆ త‌ర్వాత అటు వైపు చూడ‌లేదు. ఆల్రెడీ హిందీ డీల్ పూర్త‌యింది కానీ.. అడ్వాన్స్ మాత్ర‌మే ఇచ్చార‌ని.. ఎంత మొత్తం చెల్లించాల‌నే విష‌యంలో వేచి చూస్తున్నార‌ని స‌మాచారం.

అనిల్ త‌డాని - ఫ‌ర్హాన్ అక్త‌ర్ లాంటి వాళ్లు ఈ సినిమాను ఉత్త‌రాదిన రిలీజ్ చేయ‌డ‌మే భాగ్యం అన్న‌ట్లుగా ఉంది సైరా టీం ఆలోచ‌న‌. ఇక డిమాండ్ చేసి ఇంత కావాల‌ని అడిగే ప‌రిస్థితి ఎంత మాత్రం లేదు. మ‌రోవైపు సాహో సినిమా త‌మిళం - మ‌ల‌యాళంలో పెద్ద డిజాస్ట‌ర్ కావ‌డంతో సైరాకు చిక్కొచ్చి ప‌డింది. ఇక్క‌డ నిర్మాత రామ్ చ‌ర‌ణ్ ఆశించిన రేటు ఎంత‌మాత్రం ద‌క్కేలా లేదు. ఆ రెండు చోట్లా సినిమాను చెప్పుకోద‌గ్గ స్థాయిలో రిలీజ్ చేయ‌డ‌మే క‌ష్ట‌మ‌య్యేలా ఉంది. మ‌రీ త‌క్కువ మొత్తాల‌కు సినిమాను అడుగుతున్నార‌ట‌. ఐతే అల్లు అర‌వింద్ త‌న‌కున్న ప‌రిచ‌యాల‌తో ఓ మోస్త‌రుగా డీల్ సెట్ చేసి.. ఈ రెండు రాష్ట్రాల్లో సినిమా స‌రిగా రిలీజ్ చేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం.
   

Tags:    
  • Saaho Movie 
  • Chiranjeevi 
  • Sye Raa Movie 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS