రకుల్ రేంజి అంత పడిపోలేదు

Update: 2018-05-30 04:10 GMT
నార్త్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నిన్నటివరకు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలిగిపోయింది. దాదాపుగా స్టార్ హీరోలందరి సినిమాలకు ఆమే ఫస్ట్ ఛాయిస్ గా ఉండేది. చక్కటి గ్లామర్.. కాస్తంత అభినయం వచ్చి ఉండటం... ఎక్స్ పోజింగ్ కు పెద్దగా అభ్యంతరాలు చెప్పకపోవడం వంటివి ఆమెకు ప్లస్ పాయింట్లుగా ఉండేవి. అందుకే తక్కువ టైంలో స్టార్ హీరోలందరి పక్కన నటించింది.

కానీ ఈమధ్యన రకుల్ టైం బాలేదు. ఆమె పేరుప్రతిష్ఠలు తెచ్చిపెట్టిన టాలీవుడ్ లో ఆమె ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయడం లేదు. దీంతో రకుల్ కాస్త డీలా పడింది. ఈ టైంలో బాలకృష్ణ హీరోగా చేస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో ఆఫర్ కోసం రకుల్ చాలా గట్టి ప్రయత్నాలు చేస్తోందనే మాట టాలీవుడ్ లో వినిపించింది. బాలకృష్ణను పర్సనల్ గా కలిసి తనకు రోల్ ఇవ్వాలంటూ రిక్వెస్ట్ చేసిందనే మాటా వచ్చింది.

అయితే రకుల్ సన్నిహితులు ఇదంతా ఉత్త రూమరనే చెబుతున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ లో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ నటిస్తోంది. ఈ సినిమాలో ఇంకా ఇంపార్టెంట్ లేడీ రోల్స్ ఏమీ ఉండే అవకాశమేమీ లేదు. అలాంటప్పుడు ఏరికోరి రకుల్ ఎన్టీఆర్ బయోపిక్ లో రోల్ అడిగిందనే మాట ఉత్త రూమరే అనుకోవచ్చు. ఎందుకంటే తిరిగి లైమ్ లైట్ లోకి రావాలని అనుకుంటున్న రకుల్ హీరోయిన్ రోల్ చేయడానికి ఆలోచిస్తుందే తప్ప ఇలా వచ్చి అలా మాయమయ్యే రోల్ ఆమెకు ఏ రకంగానూ ఉపయోగపడదు.

అదీగాక రకుల్ కు ప్రస్తుతం కోలీవుడ్ లో ఆఫర్లు బాగానే వస్తున్నాయి. ఈ టైంలో చిన్నచిన్న క్యారెక్టర్లకు ఆశపడి తన కెరీర్ గ్రాఫ్ ను తనే తగ్గించుకునే పనిచేసే అవకాశం తక్కువ. తిరిగి ఏదో ఒక సినిమాలో హీరోయిన్ ఛాన్స్ దక్కేవరకు ఇలాంటి రూమర్లు రావడం మామూలే. 
Tags:    

Similar News