RRRను బ‌హిష్క‌రిస్తార‌ట‌ 'సీత'ను తొల‌గించే వ‌ర‌కూ త‌గ్గేదే లేద‌ట‌!

Update: 2021-03-17 10:12 GMT
ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయే గాలి బ్యాచ్.. ఎక్క‌డ చూసినా గుంపులు గుంపులుగా క‌నిపిస్తా ఉంట‌ది. మాట్లాడేప్పుడు ముందూ వెన‌కా చూసుకోరు. పోనీ.. మాట్లేది ఏ టాపిక్ అన్న‌ది కూడా స‌రిచూసుకోరు. వాళ్లకు న‌చ్చ‌ని వారిని తిట్ట‌డానికి ఛాన్స్ వ‌స్తే చాలు. మీద పడిపోతారంతే! నోటికి ప‌నిచెప్పి, ఆగ్ర‌హంతో ఊగిపోతారు.. ఐసాపైసా అంటారు.. చివ‌ర‌కు అంద‌రి ముందూ న‌వ్వుల పాల‌వుతారు!

రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియాభ‌ట్‌ హీరోయిన్ గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అల్లూరి సీతారామ రాజు స‌ఖిగా సీత పాత్ర‌లో న‌టిస్తోంది అలియా. ఈ చిత్రంలో ఆమె పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ను రిలీజ్ చేశాడు రాజ‌మౌళి. ప్రీ లుక్ లో రాముడి విగ్ర‌హం ముందు కూర్చున్న ఫొటో కూడా విడుద‌ల చేశారు.

ఈ పోస్ట‌ర్ చూడగానే.. ఒక్క‌సారిగా దాడి మొద‌లు పెట్టారు అలియా వ్య‌తిరేకులు. ముందూ వెన‌కా చూడ‌కుండా.. విమ‌ర్శ‌లు చేయ‌డం స్టార్ట్ చేశారు. అంతేకాదు.. RRR సినిమాను అడ్డుకుంటాం అంటూ స్టేట్ మెంట్లు కూడా ఇచ్చేశారు. వాళ్లు ఇంత‌గా ఆవేశ‌ప‌డిపోవ‌డానికి కార‌ణం.. అలియాభ‌ట్ సీత పాత్ర‌లో క‌నిపించ‌డ‌మ‌ట‌! అలియాభట్ కు సీత పాత్ర‌లో న‌టించే అర్హ‌త లేద‌ట‌. కాబ‌ట్టి.. ఆమెను ఆ పాత్ర‌లోంచి తొల‌గించాల‌ని డిమాండ్లు మొద‌లు పెట్టారు.

ఇక్క‌డే వాళ్ల తెలివి బ‌య‌ట‌ప‌డింది.. వాళ్ల ఉద్దేశం ప్ర‌కారం అలియాభ‌ట్ రామాయ‌ణంలోని సీతాదేవి పాత్రలో న‌టిస్తోంద‌ని అనుకుంటున్నారు. ఫ‌స్ట్ లుక్ లో రాముడి బొమ్మ క‌నిపిచింది కాబ‌ట్టి.. అలియాభ‌ట్ పాత్ర‌కు సీత పేరు పెట్టారు కాబ‌ట్టి.. ఇది రామాయ‌ణంలోని సీత పాత్రే అని ఫిక్స్ అయిపోయారు. మాట‌ల దాడి షురూ చేశారు.

దీన్ని బ‌ట్టి RRR క‌థేంటో వాళ్ల‌కు తెలియ‌దు. అల్లూరి సీతారామ రాజు ఎవ‌రో తెలియ‌దు. ఆయ‌న స‌ఖిపేరు సీత అని తెలియ‌దు. అస‌లు ఇది రామాయ‌ణం కాద‌న్న సంగ‌తే తెలియ‌దు. ఇవేవీ తెలుసుకోకుండా క‌ట్ట‌క‌ట్టుకొని వ‌చ్చేశారు. ఈ బ్యాచ్ లో ఓ జ‌ర్న‌లిస్టు కూడా ఉండ‌డం ఇంకా దారుణం. ఇంత‌కీ.. వీళ్లు అలియాభ‌ట్ ను వ్య‌తిరేకించ‌డానికి కార‌ణం ఏమంటే.. ఆమె నెపోటిజం నుంచి ఇండ‌స్ట్రీకి వ‌చ్చింద‌న్న‌ది వాళ్ల అభ్యంత‌రం. మొత్తానికి.. అస‌లు విష‌యం తెలియ‌కుండా గోల‌చేసి అభాసు పాల‌వుతున్నారు.
Tags:    

Similar News