అది రుచి చూసి పిత్తి వాసనలా ఉందేంటన్నాడు?
మధ్యలో భర్త నిక్ జోనాస్ వచ్చి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రియాంక చోప్రా చాలా కాలం తర్వాత మళ్లీ ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ టాక్ షోకి హాజరైంది.;
ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ ధాంపత్య జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది. ఓవైపు దిగ్విజయంగా నటిగా ప్రయాణం సాగిస్తూనే? ఓ ఇంటికి ఇల్లాలిగానూ అంతే విధిగా బాధ్యతలు నెరవర్తిస్తుంది. నిక్-పీసీ బాండింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందన్నది ఇద్దరి మద్య అన్యోన్యతను చూస్తేనే అర్దమవుతుంది. ఎనిమిదేళ్ల కాపురంలో ఎలాంటి కలతలు రాకుండా సంతోషంగా జీవిస్తారు. ఆ దంపతలుకు ఓ పాప కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సంగతి పక్కన బెడితే? ప్రియాంక చోప్రా ఈ మధ్య కాలంలో ఎక్కువగా టాలీవుడ్..బాలీవుడ్ లో కనిపిస్తోన్న సంగతి తెలిసిందే.
తెలుగులో `వారణాసి` సినిమాలో నటిస్తుండటంతో? ఇక్కడే ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకూ పీసీ ముంబైలోనే ఉంటుంది. అక్కడ నుంచి హైదరాబాద్ కు రౌండ్లు వేస్తోంది. మధ్యలో భర్త నిక్ జోనాస్ వచ్చి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రియాంక చోప్రా చాలా కాలం తర్వాత మళ్లీ ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ టాక్ షోకి హాజరైంది. ఈ క్రిస్మస్ స్పెషల్ ఎపిసోడ్‌లో ప్రియాంక చోప్రా సందడి చేశారు. ఈ ఎపిసోడ్ అంతా వినోదం, హాస్యంతో నిండిపోయింది. కపిల్ ప్రశ్నలకు పీసీ సమాధానాలు ఇచ్చి షోను అంతకంతకు హీటెక్కించారు.
దీనికి సంబంధించిన పలు క్లిప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని క్లిప్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. వీటన్నింటిలో నిక్ జోనస్ - హాజ్మోలాకు సంబంధించిన ఒక ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రియాంక తనకు భారతీయ ఛట్‌పటా స్నాక్స్ - క్యాండీలు అంటే చాలా ఇష్టమని తెలిపింది.
తాను అమెరికాలో ఉంటున్నప్పటికీ తన ఇంట్లో హాజ్మోలా, ఆమ్ పాపడ్ వంటి చిరుతిళ్ల కోసం ఒక ప్రత్యేకమైన క్యాబిన్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపింది. పీసీ వాటిని తింటునప్పుడల్లా? నిక్ జోనాస్ తరచుగా ఆ స్నాక్స్‌ను ఆసక్తిగా చూస్తుంటాడని తెలిపింది.
నిక్ ఆ స్నాక్స్ గురించి అడిగినప్పుడల్లా, `నీకు ఈ రుచులు అర్థం కావు. వీటి జోలికి రాకు` అని ప్రియాంక హెచ్చరిస్తానంది. అయినప్పటికీ, నిక్ పట్టుబట్టడంతో ఆమె అతనికి ఒక హాజ్మోలా రుచి చూపించింది. దానికి సంబంధించిన ఓ క్షణాన్ని గుర్తు చేసుకుంటూ పీసీ నవ్వులు పూయించింది. పీసీ నవ్వుతూ ఇలా చెప్పింది. `అది ( హాజ్మోలా) తిన్న వెంటనే నిక్ షాక్ అయ్యాడు.. 'దీని వాసన పిత్తుల వాసనలా ఉందేంటి? అని అడిగాడు. నిక్ ఇచ్చిన ఆ ఊహించని రియాక్షన్‌తో షోలో ఉన్నవారంతా నవ్వు ఆపుకోలేకపోయారు. ప్రేక్షకులతో పాటు షో టీమ్ కూడా ఈ మాటలకు పగలబడి నవ్వింది. ఈ ఫన్నీ మూమెంట్ ఆన్‌లైన్‌లో నెటిజన్లకు ఫేవరెట్‌గా మారింది. నిక్ జోనస్‌తో ప్రియాంక మరిన్ని భారతీయ స్నాక్స్‌ను టేస్ట్ చేయించాలని నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.