తెలుగు సినిమాలు చూడటం తప్ప చేయడానికేమీ లేదు: వీరేంద్ సెహ్వాగ్
అంతేకాదు హార్డ్ హిట్టర్ సెహ్వాగ్ నాకు ఇష్టమైన తెలుగు హీరో మహేష్ బాబు అని అన్నారు. నాకు అల్లు అర్జున్, ప్రభాస్ కూడా ఇష్టం... నేను బాహుబలిని రెండుసార్లు చూశాను.;
2015లో వీరేంద్ర సెహ్వాగ్ అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్‌లు, ఐపీఎల్ నుండి తన పదవీ విరమణను ప్రకటించారు. ఆ తర్వాత ఆయన ఏం చేస్తున్నారో హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్లో చెప్పుకొచ్చారు. తాను విరమణ తర్వాత మహేష్, అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాలు చూడటం తప్ప తనకు చేయడానికి ఏమీ లేదు! అని చమత్కరించారు.
అంతేకాదు హార్డ్ హిట్టర్ సెహ్వాగ్ నాకు ఇష్టమైన తెలుగు హీరో మహేష్ బాబు అని అన్నారు. నాకు అల్లు అర్జున్, ప్రభాస్ కూడా ఇష్టం... నేను బాహుబలిని రెండుసార్లు చూశాను. ఇప్పుడు నేను సంతోషంగా పదవీ విరమణ చేశాను కదా? కాబట్టి నాకు చేయడానికి ఇంకేమీ లేదు! అని సరదాగా వ్యాఖ్యానించారు.
ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమ కోసం ఏర్పాటు చేసిన టాలీవుడ్ ప్రో లీగ్ (TPL) ప్రారంభోత్సవంలో సెహ్వాగ్ పాల్గొన్నారు. ఈవెంట్లో వ్యాఖ్యాతలు వింధ్య విశాఖ - నిఖిల్ విజయేంద్ర సింహాతో మాట్లాడుతూ.. దక్షిణాది సినిమాలపై, ముఖ్యంగా మహేష్ బాబు, అల్లు అర్జున్ ప్రభాస్ సినిమాలపై తనకున్న ప్రేమాభిమానాల గురించి ముచ్చటించారు. పదవీ విరమణ తర్వాత తెలుగు సినిమాలు చూస్తున్నానని వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. తాను దక్షిణాది సినిమాలకు పెద్ద అభిమానిని అని చెప్పిన సెహ్వాగ్, వాటిని హిందీలో చూస్తాను అని తెలిపారు. తమిళం తెలుగు అర్థం కానందున తాను అలా చేస్తానని అన్నారు. `పుష్ప` సినిమాలోని `సాలా ఝుకేగా నహీ (తగ్గేదేలే) అనే డైలాగ్ నాకు గుర్తుంది అని అన్నారు. టిపిఎల్ ప్రారంభోత్సవ పోస్టర్‌ని నిర్మాత దిల్‌రాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కపిల్ దేవ్, సురేష్ రైనా, సెహ్వాగ్ హాజరయ్యారు.
సెహ్వాగ్ ఎక్కువగా అభిమానించే ఆ ముగ్గురు స్టార్లు ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్లుగా ఏల్తున్నారు. ప్రభాస్ `బాహుబలి` ఫ్రాంఛైజీతో, అల్లు అర్జున్ `పుష్ప` ఫ్రాంఛైజీతో దేశవ్యాప్తంగా పాపులరయ్యారు. ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళితో పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న మహేష్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లపై కన్నేసాడు. మునుముందు సెహ్వాగ్ సహా ప్రపంచ దేశాల్లోని క్రీడాకారులు మెచ్చే హీరోగా మహేష్ తనను తాను ఆవిష్కరించుకునే ప్రయత్నంలో ఉన్నాడు.