ఛాంపియన్ బ్యూటీ క్లిక్కయితే..?

అయితే ఇప్పటికే మలయాళంలో అనేక సినిమాల్లో నటించిన అమ్మడు.. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచారు.;

Update: 2025-12-23 18:30 GMT

టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేక లీడ్ రోల్ లో రూపొందిన ఛాంపియన్ మూవీ మరికొన్ని గంటల్లో విడుదల అవ్వనున్న విషయం తెలిసిందే. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఆ సినిమాలో మాలీవుడ్ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. తెలుగులోకి ఆ మూవీతోనే ఎంట్రీ ఇవ్వడం విశేషం.

అయితే ఇప్పటికే మలయాళంలో అనేక సినిమాల్లో నటించిన అమ్మడు.. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచారు. ఇంకా తెలుగు డెబ్యూ మూవీ రిలీజ్ అవ్వకుండానే ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. ఛాంపియన్ ప్రమోషన్స్ లో సందడి చేస్తూ.. అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకున్నారు.

ముఖ్యంగా టీజర్, ట్రైలర్ అదిరిపోవడంతో అంతా అనస్వర రాజన్ కోసం ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఛాంపియన్ మూవీ క్లిక్ అవుతున్నట్లు కనిపిస్తుండడంతో.. బ్యూటీకి మంచి అవకాశాలు వస్తాయామోనని అంచనా వేస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక ఆమెకు ఆఫర్స్ కచ్చితంగా వస్తాయని చెబుతున్నారు.

అందం, అభినయం సమపాళ్లలో ఉన్న అనస్వర రాజన్.. తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారే ఛాన్స్ ఉందని కామెంట్లు పెడుతున్నారు. అయితే వరుస హిట్స్ కానీ పడితే.. అనస్వర రాజన్ కెరీర్ లో బిగ్ బూస్టింగ్ అనే చెప్పాలి. రీసెంట్ గా రామ్ చరణ్ కూడా ఆమెలో మ్యాజిక్ ఉందన్న విషయం తెలిసిందే.

కాగా.. 2017లో విడుదలైన ఉదాహరణం సుజాత మూవీతో అనస్వర మాలీవుడ్ లో తన కెరీర్ ను స్టార్ట్ చేశారు. తొలి సినిమాతోనే తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుని.. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగిన అనస్వర రాజన్.. మంచి పేరు సంపాదించుకున్నారు.

కోర్ట్ రూమ్ డ్రామా మూవీ నేరులో చూపు లేని యువతిగా, లైంగిక దాడికి గురైన బాధితురాలిగా యాక్టింగ్ తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. రేఖా చిత్రం మూవీతో నటిగా మరో మెట్టు ఎక్కారు. సూపర్ శరణ్య మూవీతో అందరినీ మెప్పించారు. ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలయ్యారు.

దీంతో ఇప్పుడు ఛాంపియన్ తో వెంటనే అట్రాక్ట్ చేశారు. ప్రమోషనల్ కంటెంట్ తో మరింత దగ్గరయ్యారు. ముఖ్యంగా గిర గిర పాటతో యువ ప్రేక్షకులకు మదిలో స్థానం సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఎప్పుడూ ఉండేదే. హిట్స్ వచ్చిన వాళ్ళు బిజీ అవుతున్నారు. ఇక నటనతో ఆకట్టుకుంటే ఛాంపియన్ అమ్మాయి క్లిక్కయినట్లే. మరి ఛాంపియన్ తో ఎలా మెప్పిస్తారో.. ఎలాంటి ఛాన్స్ లు అందుకుంటారో.. ఎంతటి పొజిషన్ కు చేరుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News