RRR అప్డేట్: బర్త్ డే సందర్భంగా 'రామరాజు' అవతారంలో చరణ్..!
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీ 'ఆర్.ఆర్.ఆర్' (రౌద్రం రణం రుధిరం). ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'కొమురం భీమ్' గా నటిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'అల్లూరి సీతారామరాజు'గా కనిపించనున్నాడు. దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది. అయితే మార్చి 27న చరణ్ బర్త్ డే సందర్భంగా ట్రిపుల్ ఆర్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో RRR టీమ్ ఈరోజు ఉదయం ట్వీట్ చేస్తూ అప్డేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. చెప్పినట్లుగానే అభిమానుల కోసం ట్రీట్ రెడీ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన 'రామరాజు' అవతారంలో కనిపించే కొత్త పోస్టర్ ను విడుదల చేస్తున్నట్లు 'RRR' మూవీ టీమ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే దీనిపై కొందరు చరణ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతుండగా.. మరికొందరు మాత్రం పోస్టర్ కాకుండా ఏదైనా చిన్న వీడియో వదలమని కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే గతేడాది చరణ్ పుట్టినరోజు సందర్భంగా 'ఆర్.ఆర్.ఆర్' నుంచి 'భీమ్ ఫర్ రామరాజు' అంటూ చరణ్ ఇంట్రో వీడియోని వదిలారు. ఇప్పుడు 'రామరాజు' అవతార్ లో చరణ్ చూపించబోతున్నారు. మరి RRR టీమ్ అందించే చెర్రీ బర్త్ డే కానుక ఎలా ఉంటుందో చూడాలి.