• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  RRR టీమ్ కేరాఫ్...

RRR టీమ్ కేరాఫ్ వికారాబాద్ ఫారెస్ట్

By - Tupaki Desk
Update: 2020-01-10 12:25 GMT
స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం భారీ బడ్జెట్ తో 'RRR' సినిమాను రూపొందిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.  రిలీజ్ డెడ్లైన్ అందుకునేందుకు 'RRR' టీమ్ శరవేగంగా షూటింగ్ ను జరుపుతున్నారు.

తాజా సమాచారం ప్రకారం 'RRR' షూటింగ్ ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో జరుగుతోందట.  ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.  ఈ షెడ్యూల్ మరో వారం రోజుల పాటు జరుగుతుందట.  ఇవి చరణ్ కు సంబంధించిన సన్నివేశాలు మాత్రమే కావడంతో ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొనడం లేదట. ఈ షెడ్యూల్ తో దాదాపుగా  80% షూటింగ్ పార్ట్ పూర్తయినట్టేనని అంటున్నారు.  మార్చి నెలాఖరుకల్లా మొత్తం  షూటింగ్ పూర్తిచేయాలనే ప్లాన్ లో ఉన్నారట. ఆ తర్వాత కంప్లీట్ గా పోస్ట్ ప్రొడక్షన్ పై దృష్టి పెడతారట.  షూటింగ్ పూర్తయిన తర్వాతే ప్రమోషన్స్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారని సమాచారం. అందుకే ఇప్పుడు 'RRR' కు సంబంధించిన విశేషాలు పెద్దగా వెల్లడించడం లేదని అంటున్నారు.  

ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తోంది. ఎన్టీఆర్ కు జోడీగా ఒలివియా మోరీస్‌ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.  'RRR' ముందుగా ప్రకటించినట్టుగా జులై 30 వ తారీఖున రిలీజ్ అవుతుందని.. వాయిదా ఉండదని అంటున్నారు.


Tags:    
  • #RRR Shooting 
  • Vikarabad Forest 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS