• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రీమియర్స్ తోనే సంచలనాలు...

ప్రీమియర్స్ తోనే సంచలనాలు సృష్టించడానికి RRR మేకర్స్ ప్లాన్స్..!

By - Tupaki Desk
Update: 2021-11-16 03:57 GMT
యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రం 'ఆర్.ఆర్.ఆర్'. 2022 జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. వరుస అప్డేట్స్ అందిస్తూ అంచనాలు పెంచేశారు. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్‌ లోనూ గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.

RRR ఓవర్ సీస్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయి. యూఎస్ఏలో సరిగమ సినిమాస్ మరియు రాఫ్తార్ క్రియేషన్స్ వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అక్కడి ప్రేక్షకులలో అంచనాలను రెట్టింపు చేయడానికి ఇప్పటి నుంచే ముందస్తు ప్రమోషన్లను ప్రారంభిస్తున్నారు. జనవరి 6న ఆర్.ఆర్.ఆర్ ప్రీమియర్స్ వేస్తామని.. త్వరలో బుకింగ్స్ కూడా స్టార్ట్ అవుతాయని మేకర్స్ వెల్లడించారు.

''జనవరి 6న USA ప్రీమియర్స్. త్వరలో బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. బ్లాస్ట్ కు సిద్ధంగా ఉండండి'' అని ట్రిపుల్ ఆర్ చిత్ర బృందం సోషల్ మీడియాలో పేర్కొంది. ముందుగానే బుకింగ్స్ ఓపెన్ చేయడం ద్వారా ప్రీమియర్స్ తోనే సంచలనాలు క్రియేట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని అర్థం అవుతోంది. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా భారతీయ సినిమాల ఓవర్ సీస్ మార్కెట్ బాగా దెబ్బతినింది.

ఫస్ట్ వేవ్ తర్వాత 'జాతిరత్నాలు'.. సెకండ్ వేవ్ పరిస్థితుల అనంతరం 'లవ్ స్టోరీ' 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' వంటి సినిమాలు మాత్రమే యుఎస్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ఓవర్ సీస్ మార్కెట్ లో RRR భారీ వసూళ్లు రాబడితే.. తర్వాత రాబోయే పెద్ద సినిమాలకు నూతనోత్సాహం ఇస్తుందనడంలో సందేహం లేదు. టట్రిపుల్ ఆర్ యూఎస్ఏ బుకింగ్స్ కు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.

కాగా, రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో అల్లూరి సీతారామరాజు గా చరణ్.. కొమురం భీమ్ గా తారక్ కనిపించనున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ - అలియా భట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. కీరవాణి స్వరపరిచిన 'దోస్తీ' సాంగ్ తో పాటుగా 'నాటు నాటు' పాట సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని ఎగ్జైటింగ్ అప్డేట్స్ రానున్నాయి. RRR చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు.
Tags:    
  • RRR 
  • pre-release 
  • Rajamouli 
  • Ram Charan 
  • Jr NTR 
  • India 
  • biggest 
  • action 
  • drama 
  • update 
  • teaser 
  • pvrrr 

Similar News

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

Copyright @2026

Powered by Blink CMS