రిలీజ్ ముందే 'ఆర్ఆర్ఆర్' ఆల్ ఇండియా రికార్డ్స్ బ్రేక్..!

Update: 2021-04-02 02:30 GMT
దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ఆర్ఆర్ఆర్. రౌద్రం రణం రుధిరం అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు ముందే ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతోంది. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ పీరియాడిక్ ఫిక్షన్ డ్రామా ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్ జీవితకథల నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్స్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని అప్డేట్స్ రికార్డులు క్రియేట్ చేసాయి. ఈ సినిమాలో హీరోయిన్స్ గా అలియా భట్, ఓలివియా మోరిస్ నటిస్తున్నారు. ఐతే ఆర్ఆర్ఆర్ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. కానీ తెలియని విషయం ఏంటంటే.. ఈ సినిమా విడుదలకు ముందే డబుల్ కలెక్షన్స్ రాబట్టనుంది.

ఎలాగంటే విడుదలకు ఇంకా చాలా సమయం ఉండగానే ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగిపోయింది. ఈ సినిమాకు ఎన్నడూ లేనివిధంగా మొత్తం ఇండియన్ ఇండస్ట్రీ ఉలిక్కిపడే రేంజిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగింది. తాజా సమాచారం ప్రకారం.. ఆర్ఆర్ఆర్ సినిమా అన్ని ఫార్మాట్లతో కలిపి అక్షరాలా 900 కోట్లు బిజినెస్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే 400కోట్లు. దీన్ని బట్టి చూస్తే సినిమా ఆల్రెడీ డబుల్ కలెక్షన్స్ పొందినట్లే. ఇంతవరకు ఇండియాలో ఏ సినిమా కూడా రిలీజ్ ముందు ఈ రేంజిలో బిజినెస్ చేయలేదు. బిజినెస్ పరంగా ఆల్ రైట్స్ లెక్కలు చూసుకుంటే.. సౌత్ ఇండియా థియేట్రికల్ రైట్స్ - 330కోట్లు, ఓవర్ సీస్ - 70కోట్లు, నార్త్ ఇండియా ఆల్ రైట్స్ - 475 కోట్లు, మ్యూజిక్ - 25కోట్లు కలిపి మొత్తంగా సినిమా 900కోట్ల బిజినెస్ జరిపిందని ఇండస్ట్రీ కోడైకూస్తుంది. చూడాలి మరి ఆర్ఆర్ఆర్ విషయంలో మరెన్ని రికార్డు బ్రేకింగ్ న్యూస్ వినాల్సి వస్తుందో!
Tags:    

Similar News