#RRR ఆలియా ఎమోష‌న్ ని త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే

Update: 2020-12-10 06:57 GMT
కెరీర్ ప్రారంభించిన త‌క్కువ స‌మ‌యంలోనే అగ్ర క‌థానాయిక‌ల జాబితాలో చేరిపోయింది ఆలియాభ‌ట్. బాలీవుడ్ లో ఎంద‌రు టాప్ హీరోయిన్లు ఉన్నా ఈ కుర్ర‌బ్యూటీ ముందు దిగ‌దుడుపే అన్నంత‌గా ఎదిగేసింది. ఒక్కో సినిమాకి 8-10 కోట్ల పారితోషికం అందుకునే రేంజు ఆలియాది. అలాంటి డిమాండ్ ఉన్న స్టార్ ని ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి త‌న ప్ర‌తిష్ఠాత్మ‌క పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ కోసం లాక్ చేయ‌డం ఆస‌క్తిక‌రం.
 
ఆలియా ఇప్ప‌టికిప్పుడు వ‌రుస‌గా నాలుగైదు పాన్ ఇండియా సినిమాల‌తో బిజీ. అయినా ఎస్.ఎస్.రాజమౌలి పీరియడ్ డ్రామా ఆర్.ఆర్.ఆర్ కి ఎలాంటి ట్ర‌బుల్ ఇవ్వ‌కుండా సెట్లో జాయిన‌వుతుండ‌డం ఆస‌క్తిక‌రం. ఈ క్రేజీ మూవీ లో న‌టించేందుకు తిరిగి సెట్స్ కి జాయిన్ అయ్యింది.

రామ్ చరణ్ ఇందులో స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గా న‌టిస్తుండ‌గా.. అత‌డి స‌ర‌స‌న‌ సీత పాత్రలో నటిస్తోంది.  అలియాపై కొన్ని ఎమోషనల్ సన్నివేశాలను స్టార్ డైరెక్టర్ రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నార‌ని స‌మాచారం.

తాజా స‌మాచారం ప్రకారం.. గత రాత్రి వరకు తన సోదరి నిహారికా వివాహం కోసం రాజస్థాన్ ఉదయపూర్ లో ఉన్న రామ్ చరణ్ ఈ రోజు హైదరాబాద్ చేరుకోనున్నారు. చరణ్ ఇక్క‌డికి చేరుకున్నాక‌ ఎక్కువ విరామం తీసుకోకుండా సెట్లో జాయిన‌వుతార‌ని తెలుస్తోంది. శుక్రవారం నుండే RRR షూట్ ను తిరిగి ప్రారంభిస్తార‌ట‌. ఆలియాతో కాంబినేషన్ సన్నివేశాలను పూర్తి చేయడానికి రెడీ అవుతున్నార‌ట‌. అలియా షెడ్యూల్ వచ్చే వారం వరకు ఉంటుంది.

న‌టిస్తున్న తొలి సినిమాతోనే స‌త్తా చాటేందుకు ఆలియా ఎంత‌గానో త‌పిస్తోంది. ఇప్ప‌టికే అలియా కోచ్ ని నియ‌మించుకుని తెలుగు నేర్చుకుంది. ఆమె తన సొంత‌ స్వరంతో తన పాత్ర కోసం డబ్బింగ్ చెప్పుకోనుంది. ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క పాన్ ఇండియా మూవీతోనే దక్షిణాది చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్న ఆలియా త‌న‌దైన ముద్ర వేయాల‌నుకుంటోంద‌ట‌. ఈ హిస్టారిక‌ల్ ఫిక్ష‌న‌ల్ మూవీ కోసం డివివి దానయ్య రూ .400 కోట్ల బడ్జెట్ ని వెచ్చిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ - ఒలీవియా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.
Tags:    

Similar News