తమ్ముడి హోటల్‌ బిజినెస్‌ కు రౌడీస్టార్‌ వెరైటీ ప్రమోషన్‌

Update: 2020-11-26 06:00 GMT
విజయ్‌ దేవరకొండ హీరోగా సక్సెస్‌ అయిన వెంటనే వ్యాపారాన్ని మొదలు పెట్టిన విషయం తెల్సిందే. సొంతంగా రౌడీ బ్రాండ్‌ క్లోత్స్ ను తీసుకు వచ్చిన విజయ్‌ దేవరకొండ ఇంకా పలు రంగాల్లో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలను చేస్తున్నాడు. తన ప్రాడెక్ట్స్‌ ను మార్కెట్‌ లోకి తీసుకు వెళ్లడంలో అతడి తెలివి మామూలుగా ఉండదు. తాజాగా విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ హోటల్‌ బిజినెస్‌ లో అడుగు పెట్టాడు. గుడ్‌ వైబ్స్‌ ఓన్లీ అనే హోటల్‌ ను ఆనంద్‌ స్నేహితులతో కలిసి ప్రారంభించాడు. తన మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌ సినిమాకు వచ్చిన పారితోషికంతో ఈ హోటల్‌ బిజినెస్‌ లో అడుగు పెట్టినట్లుగా ఈ సందర్బంగా ఆనంద్‌ దేవరకొండ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

తమ్ముడి గుడ్‌ వైబ్స్‌ ఓన్లీ హోటల్‌ బిజినెస్‌ ను విజయ్‌ దేవరకొండ తనదైన శైలిలో ప్రమోట్‌ చేసేందుకు సిద్దం అయ్యాడు. ఆనంద్‌ దేవరకొండ మొదలు పెట్టిన హోటల్‌ లో శని ఆదివారాల్లో కస్టమర్లందరికి తాను సగం బిల్లు చెల్లిస్తాను అంటూ ప్రకటించాడు. అంటే ఎంత తిన్నా కూడా అందులో సగం బిల్లును విజయ్‌ దేవరకొండ చెల్లిస్తాడు అన్నమాట. రూ. 400 విలువ చేసే బిర్యానీని కస్టమర్లు తింటే కేవలం 200 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. శని ఆదివారాల్లో ఎక్కువ మందిని ఆకర్షించేందుకు ఈ ప్రయత్నం చేశారు. విజయ్‌ దేవరకొండ ఇండైరెక్ట్‌గా ఈ హోటల్‌ కు ప్రమోషన్‌ చేస్తున్నాడు.

విజయ్‌ దేవరకొండ చెల్లించినా చెల్లించకున్నా హాఫ్‌ బిల్లుతో అయినా కూడా మంచి లాభం రావడం ఖాయం అంటున్నారు. హోటల్‌ కు  మంచి పబ్లిసిటీ రావడంతో పాటు జనాలు ఒకసారి హోటల్‌ కు వచ్చారు అంటే మళ్లీ మళ్లీ వచ్చేలా చేసుకోవచ్చు. ఇలా తమ్ముడి బిజినెస్‌ కు తనవంతు సహకారం అందిస్తున్నాడు. ఈ ఐడియా ఎవరిదో కాని రౌడీ ప్రకటించడంతో ఒక వైపు వావ్‌ అంటూ అతడిని పొగడ్తలతో ముంచెత్తడంతో పాటు మరో వైపు ఐడియాకు ఫిదా అవుతున్నారు.
Tags:    

Similar News