పోలింగ్ బూత్ వద్ద అజిత్ అసహనం.. సోషల్ మీడియాలో మంటలు రేపిన వీడియోలు!

పోలింగ్ సందర్భంగా ఆయన చుట్టూ గుమిగూడిన భారీ జనసందోహం, ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.;

Update: 2026-04-23 17:07 GMT

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచారు. పోలింగ్ సందర్భంగా ఆయన చుట్టూ గుమిగూడిన భారీ జనసందోహం, ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఒక స్టార్ ను అభిమానించ‌డం, ప్రేమించ‌డం ఎంత వరకు సరైనది? ఆ అభిమానం హద్దులు దాటితే అది ఇబ్బందిగా మారుతుందా? అనే ప్రశ్న మళ్లీ ముందుకు వచ్చింది. అజిత్ ఎప్పటినుంచో తన ఫ్యాన్స్‌కు డిసిప్లిన్‌గా ఉండాలి, వ్యక్తిగత స్పేస్‌ను గౌరవించాల‌ని చెబుతూ వస్తున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం విభిన్నంగా కనిపిస్తోంది. అభిమానుల ఓవర్ ఎక్సైట్‌మెంట్ ఆయనకు అసహనాన్ని కలిగిస్తుండగా, ఈసారి ఆయన స్వయంగా మొబైల్‌తో క్రౌడ్‌ను రికార్డ్ చేయడం పరిస్థితి తీవ్రతను చూపించింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నిమిషాల్లోనే వైరల్ అయ్యాయి. ముఖ్యంగా పోలింగ్ బూత్ వద్ద జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన క్లిప్స్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వేగంగా షేర్ అవుతూ ట్రెండ్ అయ్యాయి. దీంతో నెటిజన్స్ రెండు వర్గాలుగా విడిపోయారు. కొంద‌రు అజిత్ రియాక్షన్ సరైనదేన‌ని చెప్పే వారు ఉంటే, ఇంకొంద‌రు ఫ్యాన్స్ ప్రేమను కూడా అర్థం చేసుకోవాల‌ని వాదించే వారు కనిపిస్తున్నారు.

#RespectAjith, #FansOverLimits వంటి హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతూ, కామెంట్ సెక్షన్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. కొందరు ఆయనను సింపుల్, స్ట్రైట్‌ఫార్వర్డ్ వ్యక్తిగా ప్రశంసిస్తుంటే, మరికొందరు అతిగా రియాక్ట్ అయ్యారని విమర్శిస్తున్నారు. ఈ సోషల్ మీడియా డిబేట్ ఈ ఇష్యూ ఎంత సెన్సిటివ్‌గా మారిందో స్పష్టం చేస్తోంది. అయితే అజిత్ కోపంలోనూ అర్థ‌ముంది. భారీ క్రౌడ్ మధ్య ఉండటం చాలా మందికి స్ట్రెస్ కలిగించే అంశం. ప్రత్యేకంగా ఇంట్రోవర్ట్ నేచర్ ఉన్న వ్యక్తులకు ఇది మరింత ఇబ్బందికరంగా మారుతుంది. అజిత్ వ్యక్తిత్వం కూడా అలాంటిదేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయన రియాక్షన్‌ను కేవలం కోపంగా కాకుండా, వ్యక్తిగత అసౌకర్యానికి ప్రతిస్పందనగా చూడాలనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.

అయితే ఈ సంఘటన మరో పెద్ద డిబేట్‌కు దారితీసింది. హీరోలను దేవుళ్లలా చూడటం ఎంతవరకు సరి? అనే ప్రశ్న. అభిమాన భావోద్వేగం ఒక దశ దాటితే అది సమస్యగా మారుతుందా? అనే చర్చ మళ్లీ మొదలైంది. మొత్తానికి, వైరల్ వీడియోలతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు సోషల్ మీడియా చర్చలను దాటి, ఫ్యాన్ కల్చర్ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.



Tags:    

Similar News