ఫోటో స్టోరి: మ‌ళ్లీ జిగేల్మ‌నిపిస్తున్న జిగేలు రాణీ

బాలీవుడ్ యువ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్న లేటెస్ట్ మ్యూజికల్ డ్రామా నుండి `హై జవాని తో ఇష్క్ హోనా హీ హై` అనే సాంగ్ టీజర్ విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.;

Update: 2026-04-23 17:17 GMT

బాలీవుడ్ యువ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్న లేటెస్ట్ మ్యూజికల్ డ్రామా నుండి `హై జవాని తో ఇష్క్ హోనా హీ హై` అనే సాంగ్ టీజర్ విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వరుణ్ తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన ఈ వీడియోలో అత‌డి ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ పాటలో అసలైన ఆకర్షణ మాత్రం అందాల భామ పూజా హెగ్డే అని చెప్పాలి. మిరుమిట్ల గొలిపే గ్లామరస్ దుస్తుల్లో పూజా మునుపెన్నడూ లేనంత హా*ట్‌గా కనిపిస్తూ ఇంటర్నెట్‌లో అగ్గి రాజేస్తోంది.



 


ఈ క్రేజీ సాంగ్‌లో పూజా హెగ్డేతో పాటు మరో నటి మృణాల్ ఠాకూర్ కూడా మెరవనున్నారు. మృణాల్ తనదైన క్లాస్ - యూనిక్ కంటెంట్‌ను ప్రజెంట్ చేస్తుంటే.. పూజా మాత్రం తన గ్లామర్‌తో పోటీలో తనకు ఎవరూ సాటిలేరన్నట్లుగా అందాలను ఆరబోస్తోంది. పూజా కొత్త లుక్ చూసాక‌.. మ‌ళ్లీ జిగేల్మ‌నిపిస్తున్న జిగేలు రాణీ అంటూ యూత్ హుషారుగా కామెంట్లు చేస్తున్నారు. మే 16న విడుదల కానున్న ఈ పూర్తి పాటలో పూజా హెగ్డే - వరుణ్ ధావన్‌ల కెమిస్ట్రీ, డ్యాన్స్ మూవ్స్ యువతను ఉర్రూతలూగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ పాటలోని `హై జవాని తో ఇష్క్ హోనా హీ హై` అనే క్యాచీ లిరిక్స్ మ్యూజిక్ లవర్స్ నోళ్లలో నానుతున్నాయి.



 


పూజా హెగ్డే 2026 కెరీర్ గ్రాఫ్‌ను పరిశీలిస్తే... త‌న‌ చేతిలో వైవిధ్యమైన ప్రాజెక్టులు ఉన్నాయి. వరుణ్ ధావన్‌తో చేస్తున్న ఈ మ్యూజికల్ మూవీ కాకుండా... పూజా తన కెరీర్‌లో తొలిసారిగా ఒక భారీ హారర్ ఫ్రాంచైజీలోకి అడుగుపెడుతోంది. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రాబోతున్న `కాంచన 4`లో కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. హారర్ కామెడీ జోనర్‌లో పూజా హెగ్డే కనిపించనుండటం త‌న‌ అభిమానులకు పెద్ద స‌ర్‌ప్రైజ్ అని చెప్పాలి.



 


మ‌రోవైపు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న 41వ చిత్రం (DQ41) లో కూడా పూజా హెగ్డే కథానాయికగా ఎంపికైంది. మ‌రోవైపు... ఈ భామ‌ నటించిన`జననాయగన్` మూవీ విడుదల కొంత కాలంగా నిలిచిపోయినా.. కొన్ని కొత్త ప్రాజెక్టులతో పూజా మళ్ళీ ఫామ్‌లోకి వస్తోంది. దక్షిణ భారత భాషలతో పాటు హిందీలోనూ అవ‌కాశాలు అందుకుంటోంది.

ప్రస్తుతం వరుణ్ ధావన్ `బేబీ జాన్` వంటి యాక్షన్ చిత్రాలతో బిజీగా ఉండగా.. అత‌డి గత చిత్రాల్లోని చార్ట్‌బస్టర్ సాంగ్స్ లాగే ఈ `హై జవాని` సాంగ్ కూడా రికార్డులు సృష్టిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా పూజా హెగ్డే తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లిందని టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. మే 16న ట్రీటివ్వ‌డానికి రెడీ అవుతున్న పూర్తి పాట కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News