ముంబై వీధుల్లో రౌడీ జోడీ హ‌ల్ చ‌ల్‌

Update: 2021-12-20 09:32 GMT

టాలీవుడ్ లో వున్న యువ జంట‌ల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న‌కు ప్రేక్ష‌కుల్లో ఓ ప్ర‌త్యేక‌త వుంది. వీరిద్ద‌రినీ రౌడీ జంట‌గా ప్రేమ‌గా పిలుచుకుంటుంటారు టాలీవుడ్ ప్రేక్ష‌కులు. `గీత గోవిందం`, డియ‌ర్ కామ్రేడ్ చిత్రాలతో ఈ జంట ల‌వ్‌లీ పెయిర్ గా మంచి పేరు తెచ్చుకుంది. అంతే కాకుండా ఈ జంట‌కు ప్ర‌త్యేకంగా అభిమానులు కూడా ఏర్ప‌డ్డారు.

ఈ జంట క్రేజ్ ఏ స్థాయికి వెళ్లిందంటే విడి విడి ఫ్యాన్స్ తో విజ‌య్ దేవ‌ర‌కొండ కానీ లేదా ర‌ష్మిక మంద‌న్న కానీ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఇంట‌రాక్ట్ అయితే ఫ్యాన్స్ అడిగే ఒకే ఒక్క ప్ర‌శ్న‌.

ఇద్ద‌రు పెళ్లి చేసుకోవ‌చ్చు క‌దా ? అని . అంత‌లా వీరిద్ద‌రంటే ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక‌మైన అభిమానం, క్రేజ్ ఏర్ప‌డ్డాయి. దీంతో వీరిద్ద‌రు ఎక్క‌డ క‌నిపించినా ఆ ఫొటోలు నెట్టింట వైర‌ల్ కావ‌డం మొద‌లైంది.

తాజాగా అలాంటి దృశ్య‌మే ముంబై వీధుల్లో ప్ర‌త్య‌క్ష‌మైంది. తాజాగా `పుష్ప ది రైజ్‌` హిట్‌తో మంచి జోష్ మీదున్న ర‌ష్మిక `పుష్ప` పార్ట్ 2 తో పాటు బాలీవుడ్ లో అంగీక‌రించిన చిత్రాల‌ని పూర్తి చేసే ప‌నిలో ప‌డింది. పుష్ప పార్ట్ 2 స్టార్టింగ్ కి మ‌రి కొంత స‌మ‌యం వుండ‌టంతో ర‌ష్మిక బాలీవుడ్ చిత్రాల‌ని పూర్తి చేసే ప‌నిలో బిజీగా మారిపోయింది.

ఈ సంద‌ర్భంగా ముంబైకి వెళ్లిన ర‌ష్మిక క్రేజీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ తో క‌లిసి ముంబై వీధుల్లో ప్ర‌త్య‌క్షం కావ‌డం హాట్ టాపిక్ గా మారింది. `లైగ‌ర్ ` షూటింగ్ లో బిజీగా వున్న విజ‌య్ దేవ‌ర‌కొండ షూటింగ్ నుంచి కాస్త విరామం ల‌భించ‌డంతో ఆదివారం సాయంత్రం బాంద్రా రెస్టారెంట్ కు ర‌ష్మిక‌తో క‌లిసి డిన్న‌ర్ కు వెళ్లారు. ఇకే ముందు మీడియా కంటప‌డ్డారు. ముంబై వీధుల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నఈ రౌడీ జంట ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తున్నాయి.

ఈ జంట ఫొటోలు చూసిన నెటిజ‌న్స్ `ల‌వ్లీ పెయిర్‌` అంటూ కామెంట్ లు పెడుతున్నారు. అంతే కాకుండా గ‌త కొంత కాలంగా వీరిద్ద‌రిపై వ‌రుస పుకార్లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. విజ‌య్ దేవ‌ర‌కొండ - రష్మిక మంద‌న్న ఆన్ స్క్రీన్ .. ఆఫ్ స్క్రీన్‌ కెమిస్ట్రీ ఆక‌ట్టుకుంటుండ‌టంతో వీరిద్ద‌రు నిజంగానే ప్రేమ‌లో వున్నారంటూ గ‌త కొంత కాలంగా పుకార్లు వినిపించాయి.

అయితే ఆ పుకార్ల‌పై స్పందించిన విజ‌య్‌, ర‌ష్మిక అందులో ఎలాంటి వాస్త‌వం లేద‌ని, ఇద్ద‌రం మంచి స్నేహితులం మాత్ర‌మే న‌ని క్లారిటీ ఇచ్చారు.



Tags:    

Similar News