స్టైలిష్ స్టార్ కి దారి దొరికిందా ?
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కేరళలో సైతం అశేష సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా మౌనం గత కొంత కాలంగా ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతూనే ఉంది. నా పేరు సూర్య ఫలితం తర్వాత సబ్జెక్ట్ సెలక్షన్లో చాలా జాగ్రత్తలు వహిస్తున్న బన్నీ విక్రమ్ కుమార్ కు ఓకే చెప్పినంత పని చేసి ఏమైందో ఏమో కానీ దాని గురించి మాట్లాడ్డం మానేసాడు. ఏకాభిప్రాయం కుదరలేదో లేక తన ఇమేజ్ కు తగినట్టు కథ పూర్తిగా లేదని ఫీలయ్యాడో కానీ మొత్తానికి ఇప్పట్లో మాత్రం ఆ సినిమా లేనట్టే. సరే అదే కావాలని ఫ్యాన్స్ కూడా కోరుకోలేదు కాబట్టి నెక్స్ట్ ఎవరితో అనే చర్చ మొదలైంది.
త్రివిక్రమ్ కోసం వెయిట్ చేస్తున్నాడని అరవింద సమేత వీర రాఘవ హడావిడి తగ్గగానే తనది మొదలుపెట్టేలా ఇంతకు ముందే చర్చించాడని గతంలోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు కోరుకున్న క్షణం రానే వచ్చింది. పాజిటివ్ రిపోర్ట్స్ తో పండగ సెలవుల అడ్వాంటేజ్ ని పూర్తిగా వాడుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. ఏ రేంజ్ హిట్ అనేది తేలడానికి ఇంకో వారం పడుతుంది కానీ రిజల్ట్ పట్ల బన్నీ కూడా హ్యాపీగా ఉన్నాడని టాక్.
మరి త్రివిక్రమ్ మనసులో ఏముందో తెలియాలి. అరవింద సమేత ప్రమోషన్ ఇంటర్వ్యూలో వెంకటేష్-బన్నీ-మహేష్ బాబు ఈ ముగ్గురితో భవిష్యత్తులో చేసే అవకాశాలు ఉన్నాయని కథ కుదరాలి కదా అంటూ త్రివిక్రమ్ చెప్పాడు కానీ ఏది ముందు ఉంటుంది అనే క్లారిటీ ఇవ్వలేదు. ప్రాక్టికల్ గా చూసుకుంటే వెంకటేష్ ఎఫ్2 తో పాటు వెంకీ మామ షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. మహేష్ బాబు మహర్షి ఏప్రిల్ 5 విడుదల అయ్యాకే ఫ్రీ అవుతాడు. సో అందుబాటులో ఉన్నది అల్లు అర్జున్ ఒక్కడే. సో ఈ కాంబోకె ఎక్కువ ఛాన్స్ ఉందని ఫిలిం నగర్ టాక్.
కథ ఆల్రెడీ సిద్ధంగా ఉందని చిన్న ఫినిషింగ్ టచెస్ ఇచ్చేసి త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇన్ సైడ్ టాక్. జులాయి-సన్ అఫ్ సత్యమూర్తి తర్వాత వచ్చే మూవీ అవుతుంది కాబట్టి హ్యాట్రిక్ ఆశలు రేగడం సహజం. మరి ఇది ఎంత వరకు కార్యరూపం దాల్చుతుందో మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.