• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జబర్దస్త్ లో ఎంట్రీ...

జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చిన మరో సెలబ్రిటీ

By - Tupaki Desk
Update: 2019-05-14 08:43 GMT
తెలుగులో బుల్లితెర విషయం మాట్లాడుకుంటే సూపర్ పాపులారిటీతో దూసుకుపోతున్న షో జబర్దస్త్. ఒకవైపు నచ్చని వాళ్ళు విమర్శలు సంధిస్తూనే ఉంటారు.. మరోవైపు ఆ కామెడీని ఫుల్ గా ఎంజాయ్ చస్తూ ఎంచక్కా నవ్వే ప్రేక్షకులూ ఉన్నారు. అయితే ఈమధ్య జబర్దస్త్ షోలో జడ్జిలు మారిన సంగతి తెలిసిందే.  జబర్దస్త్ అనగానే మనకు గుర్తొచ్చేది నాగబాబు.. రోజా.  వారు లేకుండా జబర్దస్త్ ను ఊహించుకోలేం.  ఆ ఇద్దరూ ఈమధ్య ఎన్నికల్లో పోటీ చేయడంతో జబర్దస్త్ తీర్పులకు విరామం ప్రకటించారు.  దీంతో జబర్దస్త్ నిర్వాహకులు వారికి ప్రత్యామ్నాయంగా శేఖర్ మాస్టర్.. మీనాలను తీసుకొచ్చారు.

గత రెండువారాలుగా మళ్ళీ రోజా జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. నాగబాబు ఇంకా జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇవ్వలేదు కానీ కొత్తగా మరో సెలబ్రిటీ జబర్దస్త్ జడ్జ్ అవతారం ఎత్తారు. ఆమె ఎవరో కాదు.. సీనియర్ హీరోయిన్ సంఘవి. తాజాగా సంఘవి రోజాతో కలిసి జబర్దస్త్ కార్యక్రమంలో జడ్జిగా వ్యవహరించారు.  చూస్తుంటే మీనా స్థానంలో సంఘవిని తీసుకొచ్చినట్టుగా అనిపిస్తోంది.  కన్నడ భామ అయిన సంఘవి  ఒక పదిహేనేళ్ళ క్రితం స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. చిరంజీవి.. బాలకృష్ణ.. నాగార్జున లాంటి స్టార్ల సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.  ఇప్పుడు చాలా కాలం తర్వాత ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో కనిపించడం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభవమే.  

నాగబాబు రీ ఎంట్రీ ఇచ్చేవరకూ రోజాతో కలిసి సంఘవి జబర్దస్త్ కార్యక్రమాన్ని నడిపిస్తారని అంటున్నారు. ఏదైతేనేం. జబర్దస్త్ జడ్జిల లిస్టులో మరో సెలబ్రిటీ చేరింది.  రోజాతో కలిసి సంఘవి చేసే సందడి ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని టాక్.
    

Tags:    
  • Roja 
  • Sanghavi 
  • Jabardasth Show 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS