• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టు పాయింట్ ఓ.. పేరు...

టు పాయింట్ ఓ.. పేరు మార్చండి

By - Tupaki Desk
Update: 2017-09-09 07:57 GMT
ఇండియా సినిమా చరిత్రలో మరో గొప్ప సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టడానికి రెడీ అవుతోంది. శంకర్ - రజినీకాంత్- అక్షయ కుమార్ లాంటి మహా మహులు కలిసి పని చేస్తున్న సినిమా రోబో 2.0 షూటింగ్ దాదాపు అయిపోయినట్లే. కేవలం కొన్ని గ్రాఫిక్స్ పనులు మరియు పాటలకు సంబందించిన చిత్రీకరణ పనులు మాత్రమే ఉన్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

ఇకపోతే అక్టోబర్ లో సినిమా ఆడియోను దుబాయ్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారట. ఇక టాలీవుడ్ ప్రేక్షకులపై ప్రేమతో నవంబర్ లో  హైదరాబాద్ కు వచ్చి చిత్రబృందం టీజర్ ని రిలీజ్ చేయనుంది. ట్రైలర్ ను మాత్రం చెన్నై లో డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని  చెప్పారు. కాని ఈ సందర్భంగా వీరు రోబో సీక్వెల్ ను చాలా స్పష్టంగా.. '2.ఓ' అనే రాస్తున్నారు. అంటే 'టూ పాయింట్ ఓ' అని మనం చదవాలనమాట. మనం హాలీవుడ్ లో ఎక్కువగా 'జీరో' ను 'ఓ'ను పిలవడం గమనించే ఉంటాం. జేమ్స్ బాండ్ ను కూడా జీరో జీరో సెవెన్ అనకుండా.. 'డబుల్ ఓ సెవెన్' అని పిలుస్తుంటారు. ఎలా పలికినా కూడా.. రాసేది మాత్రం 007 అనే. అలాగే ఇప్పుడు రోబో సీక్వెల్ విషయంలో కూడా మనందరం దానిని చదివే తీరు మారాంటే.. 2.ఓ.. ఎలియాస్ 'టూ పాయింట్ ఓ' అంటున్నారు.

ఇక అక్టోబర్ నుంచే 2.ఓ చిత్ర దర్శకుడు శంకర్ బాహుబలిని మించిన రేంజ్ లో ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 350 కోట్లతో రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరి 25న ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ఇప్పటికే నిర్మాతలు చాలా సార్లు చెప్పారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అమీ జాక్సన్ నటిస్తుండగా ఏర్. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.



Tags:    
  • Rajinikanth 
  • Shankar 
  • Robo 2.0 Movie 
  • TElugu NEWs 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS