• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నిర్మాత కొడుకు రజినీని...

నిర్మాత కొడుకు రజినీని పట్టుకోబోయి..

By - Tupaki Desk
Update: 2016-12-05 17:30 GMT
తన ప్రతి సినిమాతోనూ ప్రేక్షకులకు ఏదో ఒక కొత్త అనుభూతి పంచాలని ప్రయత్నిస్తుంటాడు శంకర్. అతను కొత్త టెక్నాలజీని టచ్ చేశాడంటే.. అది వంద శాతం పర్ఫెక్టుగా ఉండాలని చూస్తాడు. ఈ విషయంలో రాజీ అన్నదే ఉండదు. ఇప్పుడు త్రీడీ టెక్నాలజీ విషయంలోనూ శంకర్ ఇదే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటిదాకా ఇండియాలో వచ్చిన త్రీడీ సినిమాలన్నీ పూర్తిగా త్రీడీలో తెరకెక్కినవి కావని.. ముందు 2డీలో తీసి.. తర్వాత త్రీడీలోకి మారుస్తున్నారని.. కానీ ‘2.0’ను మాత్రం పూర్తిగా త్రీడీలోనే తెరకెక్కిస్తున్నారని.. ఇండియాలో ఇలా త్రీడీ సినిమా తీయడం ఇదే తొలిసారని అంటున్నాడు ‘2.0’ నిర్మాతల్లో ఒకడైన రాజు మహాలింగం.

త్రీడీలో రజినీకాంత్ ను చూసి అభిమానులు థ్రిల్లవడం ఖాయమని అంటున్నాడు రాజు మహాలింగం. ఇటీవలే తన పదేళ్ల కొడుకుని ‘2.0’ షూటింగుకి తీసుకెళ్లి.. అక్కడ త్రీడీ గ్లాసులేయించి రషెస్ చూపించగా.. అతను రజినీ తన దగ్గరికి వస్తున్నాడని భ్రమించి.. ఆయన్ని పట్టుకోవాలని ప్రయత్నించాడని రాజు తెలిపాడు. వచ్చే ఏడాది దీపావళికి ‘2.0’ విడుదలయ్యాక ప్రతి ప్రేక్షకుడికీ ఇలాంటి అనుభూతే కలుగుతుందని చెప్పాడు. ‘2.0’లో కేవలం మల్టీప్లెక్సుల వరకే కాకుండా బి.. సి సెంటర్లలోనూ త్రీడీలో చూపించాలని ప్రయత్నిస్తున్నామని.. ఇందుకోసం ఒక భారీ ప్రాజెక్టును తలకెత్తుకున్నామని.. అన్ని థియేటర్ల వాళ్లతోనూ సంప్రదింపులు జరుపుతూ త్రీడీకి అప్ గ్రేట్ చేయించడానికి సన్నాహాలు చేస్తున్నామని రాజు మహాలింగం తెలిపాడు. మొత్తానికి ‘2.0’ ఇండియన్ సినిమాలో ఓ మైలురాయిలా మారేలాగే కనిపిస్తోంది ఈ చిత్ర నిర్మాత మాటలు చూస్తుంటే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Robo 2.0 
  • Rajinikanth 
  • Telugu NEws 

Similar News

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS