గోవా బీచ్ లో హాట్ హీరోయిన్ రిసార్ట్ కం వెల్ నెస్ సెంట‌ర్

Update: 2021-03-27 18:30 GMT
మంచు మ‌నోజ్ స‌ర‌స‌న `నేను మీకు తెలుసా?` అనే చిత్రంలో న‌టించింది రియా సేన్. క్యూట్ లుక్స్ హాట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో యువ‌త‌రాన్ని ఆక‌ర్షించిన‌  ఈ అమ్మ‌డు ఆ సినిమా ఫ్లాప‌వ్వ‌డంతో తిరిగి ఇక్క‌డ క‌నిపించ‌లేదు. అటుపై బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో న‌టించినా అక్క‌డా అంతంత మాత్ర‌మే. ఇటీవ‌ల అస‌లు ఆఫ‌ర్లు అన్న‌వే లేవు. దీంతో సోష‌ల్ మీడియాల్లో వ‌రుస ఫోటోషూట్ల‌తో యోగా భంగిమ‌ల‌తో హీట్ పెంచేస్తోంది.

ఇటీవ‌ల రియా బాత్ ట‌బ్ ఫోటోషూట్ తో ఫ్యాన్స్ లో వైర‌ల్ అయ్యింది. ఆ త‌ర్వాత  యోగా పాఠాల్ని చెప్పేందుకు టీచ‌ర్ గా అవ‌తార‌మెత్తింది.
యోగా క్లాసులు చెబుతున్న ఫోటోల్ని సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేసింది. తాజాగా మ‌రో కిల్లింగ్ ఫోటోని షేర్ చేసింది. రియా త‌న కొత్త బిజినెస్ ని ప‌రిచ‌యం చేసేందుకు ఈ స‌రికొత్త ఫోటోషూట్ తో తెర‌పైకొచ్చింది.

ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 4 మధ్య నా మొదటి @ బలిస్యా ఈవెంట్ ప్రారంభమవుతుందని రియా సేన్ ప్రకటించింది. గాళ్స్ స్పెష‌ల్ రిసార్ట్ ఇది. అంత‌ర్గ‌త సౌంద‌ర్యానికి ప్రాధాన్య‌త‌నిచ్చి కౌన్సిలింగ్ తో యోగాతో అందమైన యోగిని గా మార్చే వేదిక ... రిసార్ట్ ‌లో మరపురాని అనుభవాన్ని అందిస్తాం. మాతో క‌లిసేందుకు ఆసక్తి కలిగి ఉంటే దయచేసి మా అధికారిక‌ వెబ్ లో ట‌చ్ లో‌కి రండి! అంటూ ఆహ్వానించింది రియా. బ‌లిస్వా అనేది రిసార్ట్ కం వెల్ నెస్ సెంట‌ర్. ఇక్క‌డ వెల్ నెస్ మైండ్ ఫ్రీనెస్ కి సేవ‌లు చేస్తుంద‌ట‌.

రియా సేన్ .. పాపుల‌ర్ క్లాసిక్ నాయిక మున్ మున్ సేన్ కుమార్తె. తల్లి వార‌స‌త్వాన్ని నిల‌బెడుతూ తాను కూడా క‌థానాయిక అయ్యింది. అయితే ఆశించిన స్థాయిలో కెరీర్ ని మాత్రం సాగించ‌లేక‌పోయింది.  రియా సోద‌రి రైమాసేన్ సైతం క‌థానాయిక‌గా ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మైన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News