• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వెంటపడ్డ ఫొటోగ్రాఫర్లు......

వెంటపడ్డ ఫొటోగ్రాఫర్లు... రియా చక్రవర్తి జస్ట్ మిస్

By - Tupaki Desk
Update: 2023-01-18 09:20 GMT
రియా చక్రవర్తి.. నటిగా కంటే కూడా దివంగత నటుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రేయసిగానే ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. 2019 ఏప్రిల్ లో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ తో డేటింగ్ ప్రారంభించిన ఈ అమ్మడు.. అదే ఏడాది డిసెంబర్ నుంచి అతడితోనే కలిసి ఉండడం ప్రారంభించింది. చాలా రోజుల పాటు వీరిద్దరూ ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. అయితే 2020 జూన్ 14వ తేదీన అనుకోని విధంగా సుషాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత ఈమెపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.

నేరుగా సుషాంత్ తండ్రే.. రియా, ఆమె కుటుంబ సభ్యులపై పోలసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడి ఆత్మహత్యకు కారణం రియా ఆమె కుటుంబమే అని ఆరోపించారు. మొదట ముంబై పోలీసులు కేసు దర్యాప్తు చేసినప్పటికీ.. దాన్ని తర్వాత సీబీఐకి బదిలీ చేశారు.

ఇప్పటికీ ఆ కేసు కొనసాగుతూనే ఉంది. డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొని జైలుకు కూడా వెళ్లింది రియా చక్రవర్తి. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చింది. ఆ తర్వాత నుంచి ఆమె మీడియాకు ఎక్కువగా కనిపించట్లేదు. అప్పుడప్పుడు మాత్రమే బయటకు వస్తోంది. అయినా మీడియాతో పెద్దగా ఏం మాట్లాడట్లేదు.

తాజాగా రియా చక్రవర్తి బయటకు వచ్చింది. ఈ క్రమంలో మీడియా కంటపడింది. దీంతో ఫొటోగ్రాఫర్లు ఆమె వెంట పడ్డారు. వారికి సమాధానం చెప్పడం ఇష్టంలేని రియా.. పరుగు పరుగును వెళ్లింది. ఈ క్రమంలోనే కింద పడిపోబోయింది.

కానీ తనను తాను బ్యాలెన్స్ చేసుకొని పడిపోకుండా నిలబడింది. మేడం మెళ్లగా వెళ్లండంటూ ఫొటో గ్రాఫర్లు సూచించగా.. మీరు నా వెంట పడితే ఇలాగే జరుగుతుందని.. పొలైట్ గా చెప్పి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

అయితే తూనీగా తూనీగా సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన రియా.. ఆ తర్వాత హిందీలోని మేరే డాడ్ కి మారుతి, సోనాలి కేబుల్, దొబరా, హాఫ్ గర్ల్ ఫ్రెండ్, బ్యాంకు చోర్, జిలేబీ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్, హిమేష్ రష్మీతో కలిసి చెహరే సినిమాలో నటించినప్పటికీ.. ఆ సినిమా ఇప్పటి వరకూ రిలీజ్ కాలేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View



Tags:    
  • RheaChakraborthy 
  • Photographers 
  • SocialMediaViral 
  • FallingDown 
  • Steps 
  • TelugufilmIndustry 
  • ThuneygaThuneygaMovie 
  • MovieNews 

Similar News

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS