హే కంగ‌నా! యు ఆర్ ఏ ఫ‌**గ్ న్యూక్లియ‌ర్ బాంబ్!!

Update: 2021-02-17 05:36 GMT
క్వీన్ కంగ‌న ర‌నౌత్ ఇటీవ‌ల ప‌లువురు రాజ‌కీయ నాయ‌కుల‌పై సాగించిన వార్ గురించి తెలిసిన‌దే. ముంబై శివ‌సేనానుల‌కే చెమ‌ట‌లు ప‌ట్టించిన వీర‌నారి అంటూ ప్ర‌శంస‌లు కురిశారు. చాలా కాలంగా బాలీవుడ్ ఇన్ సైడ‌ర్స్ కి కంటిమీద కునుకుపట్ట‌నివ్వ‌కుండా చేస్తున్న కంగ‌న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణానంత‌రం మ‌రింత‌గా చెల‌రేగారు. ప‌రిశ్ర‌మ కొలీగ్స్ తో పాటు రాజ‌కీయ నాయ‌కుల్ని విడిచిపెట్ట‌లేదు. బాలీవుడ్ మాఫియా అంటూ సినీ పెద్దల్లో ఔట్ సైడ‌ర్స్ పై కుట్ర‌లు చేసేవాళ్ల‌ను మాట‌ల తూటాల‌తో తూట్లు పొడిచారు.

కంగ‌న స్పీడ్ కి ప్ర‌తిసారీ ప్ర‌శంస‌లు కురిపించే ఆర్జీవీ న‌ట‌వార‌సులే ప‌రిశ్ర‌మ‌లో ఎదుగుతారు! అన్న పాయింట్ ని మాత్రం వ్య‌తిరేకించారు. అలా అయితే ప‌రిశ్ర‌మ‌లో ఎంద‌రో న‌ట‌వారసులు ఎందుకూ కొర‌గాకుండా పోయారు అంటూ ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఇక కంగ‌నలోని డైన‌మిజాన్ని దూకుడును.. కెరీర్ మ్యాటర్స్ ని ఆయ‌న ఎప్పుడూ ఎంక‌రేజ్ చేస్తూనే ఉన్నారు.

మ‌రోసారి ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వ‌ర్మ‌.. క్వీన్ కంగ‌న‌ను ఆకాశానికెత్తేశారు. ``నువ్వు నిజంగా న్యూక్లియర్ బాంబ్`` అంటూ పొగిడేశారు. క్వీన్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన‌ సెల్ఫీ ఫొటోను చూసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ వ్యాఖ్య‌ను చేశారు. ``ఒక ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్ ‌గా నా కెరీర్ లో నేను చూసిన ఒక న‌టి బెస్ట్ క్లోజప్ ఇది. ఇలాంటి రియాలిటీ ఫొటో చూసిన తరువాత ఎవరిని నేను ఇంత గొప్పగా గుర్తు చేసుకోలేను.. హే కంగనా యు ఆర్ ఏ ఫ‌**గ్ న్యూక్లియ‌ర్ బాంబ్!``.. అంటూ రామ్ గోపాల్ వర్మ ఎగ్జ‌యిట్ అయిపోవ‌డం ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News