• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హీరో నిఖిల్ అడిగిమరీ...

హీరో నిఖిల్ అడిగిమరీ తిట్టించుకుంటున్నాడా...?

By - Tupaki Desk
Update: 2020-07-23 07:50 GMT
వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పై కామెంట్స్ చేయడానికి సినీ ప్రముఖులు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే తన ఇంటెలిజెన్స్ తో ఆయన మాట్లాడే మాటలతోనే కాకుండా తన సినిమాలతో కూడా కౌంటర్స్ వేస్తుంటారు వర్మ. అందరూ గ్రేట్ పర్సనాలిటీ అని పొగిడే వారిని కూడా ఒక్క కామెంట్ తో కిందకి లాగుతాడు. ఈ క్రమంలో తనను పట్టించుకోని వారిని తన చేష్టలతో పట్టించుకునేలా చేస్తాడు. ఇక తనపైన కామెంట్స్ చేసిన వారిపై కూడా అదే రీతిలో స్పందిస్తుంటారు ఆర్జీవీ. ఈ క్రమంలో యువ హీరో నిఖిల్ ట్వీట్ పై స్పందించారు వర్మ.

కాగా రామ్ గోపాల్ వర్మ లేటెస్టుగా 'పవర్ స్టార్' అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని పోలిన ప్రవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో చూపించి పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. ఈ సినిమా నిజ జీవితంలోనే ఏ వ్యక్తిని ఉద్దేశించి తీసింది కాదని.. పార్టీ పెట్టి ఓడిపోయిన ఓ స్టార్ హీరోతో తీస్తున్న ఫిక్షనల్ స్టోరీ అని.. ఎవరికైనా దగ్గరి పోలికలు ఉంటే ఇది యాదృచ్చికంగా జరిగింది మాత్రమే అని చెప్పుకొచ్చాడు. వర్మ ఎంత చెప్పినా అది పవన్ కళ్యాణ్ పై సెటైరికల్ గా తీస్తున్న సినిమా అని చిన్న పిల్లలని అడిగినా చెప్తారు. ఈ క్రమంలో నిన్న 'పవర్ స్టార్' ట్రైలర్ రిలీజ్ చేసారు.

ఇక 'పవర్ స్టార్' ట్రైలర్ చూసినప్పటి నుంచి ప్రతి పవర్ స్టార్ అభిమాని వర్మపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కథ అంటూ వర్మ చూపించిన ఈ ట్రైలర్ చూసి ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ని అభిమానించే సినీ ప్రముఖులు కూడా వర్మపై కోపంగా ఉన్నారని తెలుస్తోంది. కాకపోతే వర్మపై కామెంట్ చేసి అనవసర తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకని సైలెంట్ గా ఉన్నారట. అయితే హీరో నిఖిల్ మాత్రం సైలెంటుగా ఉండలేక పరోక్షంగా వర్మను ఉద్దేశిస్తూ ట్వీట్ చేసారు. ''శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా.. ఆ మహా శిఖరం తల తిప్పి చూడదు.. మీకు అర్థం అయిందిగా'' అంటూ ట్వీట్ పెట్టారు నిఖిల్. ఈ ట్వీట్ లో రామ్ గోపాల్ వర్మ నేమ్ ఎక్కడా మెన్షన్ చేయనప్పటికీ అది పరిస్థితులను బట్టి చూస్తే అతన్ని టార్గెట్ చేసి పెట్టిందే అని ఇట్టే అర్థం అవుతుంది.

కాగా ''పవర్ స్టార్'' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ దీనిపై స్పందించాడు. నిఖిల్ ఎవరో కూడా తనకు తెలియదని.. అలా కామెంట్స్ చేసేవాళ్లంతా పవన్ కళ్యాణ్ కి తొత్తులుగా ఉంటారని సెటైర్స్ వేశారు. ఆర్జీవీ మాట్లాడుతూ.. ''నిఖిల్ ఎవడో నాకు తెలియదు. నిఖిల్ కావచ్చు.. కిఖిల్ కావచ్చు.. వాళ్లందరూ కూడా ఒకే కోవకు చెందినవాళ్లు. పవన్ కళ్యాణ్ కింద తొత్తులుగా ఉంటారు. ఇలా తొత్తుల్లా ఉంటే పవన్ కళ్యాణ్‌ కు వీళ్లమీద ఎదో మంచి ఇంప్రెషన్ వస్తుందని వీళ్ల ఆశ. బానిసత్వం అనే బుద్ధిలో నుంచి వచ్చే ఆలోచన ఇది. నిఖిల్ ఒక పెద్ద స్టార్ అయ్యుండొచ్చు.. కానీ వాడు ఎవడో నాకు తెలీదు. కామెంట్స్ చేసే కొన్ని వేలమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో అతను కూడా ఒకడు అయ్యుంటాడు. దానికి అంత ఇంపార్టెన్స్ ఏముంది'' అని వర్మ శైలిలో స్పందించారు.

ఇదిలా ఉండగా నిఖిల్ అనవసరంగా ఈ విషయంలో తరదూర్చడానే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ఇప్పుడు వర్మ అతను ఎవరో కూడా తెలియదని కౌంటర్ ఇవ్వడంతో అందరికీ అలుసై పోయాడని అంటున్నారు. కొందరు మాత్రం పవన్ కళ్యాణ్‌ దృష్టిలో పడటం కోసం నిఖిల్ ఇలా అడిగిమరీ తిట్టించుకుంటున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా నిఖిల్ హీరో అవడానికి చిరంజీవి - పవన్ కళ్యాణ్ లు ఎలా ఇన్స్పిరేషనో.. ఇండస్ట్రీ చాలా మంది డైరెక్టర్స్ కి రామ్ గోపాల్ వర్మ ఇన్స్పిరేషన్ అని.. అలాంటి డైరెక్టర్ పై తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేయడం తగదని అంటున్నారు. మొత్తం మీద నిఖిల్ ట్వీట్ పై సెటైరికల్ గా స్పందించిన వర్మ.. నిఖిల్ కి ఇవ్వాల్సింది ఇచ్చేసాడని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
Tags:    
  • RGV 
  • Nikhil Comments 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS