ఎన్టీఆర్‌ పదవి పోవడం, మరణం ఆమె వల్లే : వర్మ

Update: 2018-12-17 04:28 GMT
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ప్రస్తుతం అత్యంత వివాదాస్పద మూవీ అయిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. అంతా కొత్త వారి తో వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమా కు సంబంధించిన పలు విషయాలను వర్మ పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తాజా గా ఒక ప్రముఖ టీవీ ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ మరో సారి ఈ చిత్రం లో ఏం చూపించబోతున్నాను, ఎలా ఉండబోతుంది అనే విషయాల పై క్లారిటీ ఇచ్చాడు.

లక్ష్మీ పార్వతి పై కొందరి లో నెగటివ్‌ థాట్‌ ఉంది, ఆమె వల్లే ఎన్టీఆర్‌ చివరి రోజుల్లో ఆ పరిస్థితి ఎదుర్కొన్నాడు అంటూ భావన ఉంది, మీరు ఆ విషయాలను ఎలా చూపించబోతున్నారు అంటూ వర్మ ను యాంకర్‌ ప్రశ్నించిన సమయంలో ఆయన స్పందిస్తూ... ఎన్టీఆర్‌ తో లక్ష్మీ పార్వతి రిలేషన్‌ షిప్‌ కారణంగానే ఆయన పదవి పోవడం, చనిపోవడం జరిగింది. వారిద్దరి కలయిక వల్లే అనూహ్య రాజకీయ పరిణామాలు ఏర్పడ్డాయి అన్నాడు వర్మ. ఆ రాజకీయ పరిణామాలన్నింటిని కలిపి ఈ చిత్రం ఉంటుందని వర్మ అన్నాడు.

మొదట్లో తాను కూడా లక్ష్మీ పార్వతి గురించి తప్పు గా ఆలోచించే వాడిని. కాని ఒకసారి ఎన్టీఆర్‌ గారు ఆమె గొప్పదనం చెప్పినప్పుడే పాజిటివ్‌ గా ఆలోచించడం మొదలు పెట్టాను. అప్పటి నుండే వారిద్దరి బందం గురించిన సినిమా తీయాలని నిర్ణయించుకున్నాను అంటూ వర్మ పేర్కొన్నాడు.
Tags:    

Similar News