వర్మలో వచ్చిన ఈ మార్పు దేనికి సంకేతం?
రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. ఎప్పుడు తనకు ఏది తోస్తే అది పోస్ట్ చేస్తూ ఉంటాడు. దాన్ని వల్ల ఇతరులు ఏమనుకుంటారు, ఇతరుల మీద ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయాన్ని ఆలోచించడు. ఆయనకు నచ్చిన విధంగా చేసుకుంటూ వెళ్తాడు. ఏవో ఏవో పోస్ట్ చేస్తూ ఉంటాడు కాని, ఆయన కుటుంబ సభ్యుల గురించి మాత్రం చాలా అరుదుగా పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఆయన కూతురు ఫొటోను అప్పుడప్పుడు పోస్ట్ చేసే వర్మ తాజాగా ఆయన మేనకోడలి ఫొటోలను పోస్ట్ చేశాడు.
మొన్న కూతురు చిన్నప్పటి ఫొటోను ట్వీట్ చేసిన వర్మ తాజాగా మేనకోడలితో దిగిన సరదా పిక్స్ ను ట్వీట్ చేశాడు. రామ్ గోపాల్ వర్మ మేనకోడలు శ్రావ్యవర్మ. ఈమె ప్రముఖ స్టార్స్ కు కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తుంది. ఈమె టాలీవుడ్, టాలీవుడ్ కోలీవుడ్ కు చెందిన త్రిష, కీర్తి సురేష్, రష్మిక మందన్న, సైనా నెహ్వాల్, రాశిఖన్నా ఇంకా ప్రముఖ హీరోయిన్స్ కు కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసింది. ఎన్నో సినిమాల్లో ఈమె వర్క్ చేసింది. వర్మ ప్రోత్సాహంతో ఈమెకు మంచి ఆఫర్లే వచ్చాయి.
ఇన్ని రోజుల నుండి మేనకోడలి గురించి, శ్రావ్య వర్మ తన మేనకోడలు అనే విషయాన్ని బయట పెట్టని వర్మ ఇప్పుడు ఆ విషయాన్ని బయట పెట్టడంతో పాటు మూడు ఫొటోలను కూడా షేర్ చేసి తన మేనకోడలు ముసలి వాడిని అయినా నాకు మంచి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తానంటూ చెప్పిందని ఫన్నీగా కామెంట్ చేశాడు. మొత్తానికి మొన్న కూతురు ఫొటోను, నిన్న మేనకోడలి ఫొటోలను షేర్ చేసిన వర్మ మెల్ల మెల్లగా ఫ్యామిలీ జోన్ వైపుకు వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. మరి ఈ మార్పు ఎంత దూరం వెళ్తుందో చూడాలి.