• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రెడ్లరాజ్యంలో వెలమదొరలు.....

రెడ్లరాజ్యంలో వెలమదొరలు.. చేయనన్న ఆర్జీవీ

By - Tupaki Desk
Update: 2019-11-04 07:16 GMT
రామ్ గోపాల్ వర్మ అంటే పబ్లిసిటీ.. పబ్లిసిటీ అంటే రామ్ గోపాల్ వర్మ.  అయన ప్రశాంతంగా ఉండే కొలనులో నాలుగు రాళ్ళు వేసి కల్లోలం సృష్టించగలడు.  అలానే మండుతున్న మంటల్లో ఇంకాస్త పెట్రోల్ పోసి చలి కాచుకాగలడు.  ఇవన్నీ చేసి తనసినిమాకు ఫుల్ పబ్లిసిటీ తెచ్చుకోగలడు.   జస్ట్ 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' టైటిల్ తోనే సంచలనం సృష్టించిన వర్మ ఆ సినిమాకు మరింత ప్రచారం కల్పిస్తున్నాడు.

ఈ సినిమా నుండి ఇప్పటికే టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది.  రీసెంట్ గా క్రైస్తవ ప్రచారకుడు.. ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఎ పాల్ పై ఒక పాట విడుదల చేశారు.  నేనే కేఎ పాల్ అంటూ సాగే ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది.  దీంతో అన్ని టీవీ ఛానల్స్ లోనూ 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమాకు సంబంధించిన చర్చలే సాగుతున్నాయి. తాజాగా ఒక ఛానల్ లో పాయింట్ బ్లాంక్ అనే ప్రోగ్రామ్ లో ఆర్జీవీ తనదైన శైలిలో జవాబులిచ్చారు.  

'ఆర్జీవీ గారు.. మీరు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను ఉద్దేశించి 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' అనే సినిమాను తీస్తున్నారు. అలానే తెలంగాణాలో రెడ్ల ప్రాబల్యం ఎక్కువ కదా.. 'రెడ్ల రాజ్యంలో వెలమదొరలు' అనే సినిమాను తీస్తారా?' అని  ప్రశ్నిస్తే.. 'తీయను. ఎందుకంటే నాకు కేసీఆర్ అంటే ఇష్టం' అంటూ బదులిచ్చారు. వర్మ తన సమాధానం చెప్పి అప్పటికి తప్పించుకున్నారు కానీ సోషల్ మీడియాలో వర్మపై సెటైర్లు పేలుతున్నాయి.

కేసిఆర్ అంటే వర్మకు భయమని.. అందుకే కేసీఆర్ కు బాకా ఊదేలా 'టైగర్ కేసీఆర్' అనే సినిమాను గతంలో ప్రకటించారని.. ఇప్పుడేమో 'రెడ్లరాజ్యంలో వెలమదొరలు' సినిమా ఆలోచనను కూడా అంగీకరించడం లేదని అంటున్నారు. 
Tags:    
  • RGV 
  • Kcr 
  • GHMC 
  • Telangana Cm 
  • Ram Gopal Varma 
  • Reddla Rajyam Lo Velama Doralu 

Similar News

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

Copyright @2026

Powered by Blink CMS