'పవర్ స్టార్' ఫస్ట్ లుక్ విడుదల...!

Update: 2020-07-09 07:09 GMT
కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తన వ్యాఖ్యలతోనే కాకుండా సినిమాలతో కూడా వివాదాలు రేపుతూ ఉంటారు. ఎప్పుడు ఎవరినో ఒకరిని గిల్లుతూ వివాదాలు కొని తెచ్చుకుంటాడనే విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల 'పవర్ స్టార్' అనే సినిమా అనౌన్స్ చేసి సంచలనం రేపాడు వర్మ. అంతేకాకుండా ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ రోజు ఉదయం 11.37 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. చెప్పినట్లుగానే రామ్‌ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా 'పవర్ స్టార్' ఫస్ట్ లుక్ విడుదల చేసారు.

ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో త్వరలోనే 'పవర్ స్టార్' సినిమా రిలీజ్ కానుందని.. 'జై పవర్ స్టార్' అని ట్వీట్ చేసారు వర్మ. ఈ పోస్టర్ లో ప్రధాన పాత్రధారి సోఫా మీద కూర్చొని సీరియస్ గా ఆలోచిస్తున్నాడు. అంతేకాకుండా ఇది 'ఎన్నికల ఫలితాల తర్వాత కథ' అని ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. రామ్ గోపాల్ వర్మ 'పవర్ స్టార్' సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇది పూర్తిగా కల్పిత చిత్రం.. ఏదైనా నిజ జీవిత వ్యక్తులతో పోలిక ఉంటే అది యాదృచ్చికంగా జరిగింది మాత్రమే అని చెప్పుకుంటూ వస్తున్నా.. ఈ సినిమా 'జనసేన' అధినేత పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి తీస్తున్న సినిమా అని అర్థం అయ్యేలా ట్వీట్స్ పెడుతున్నారు.
Read more!

అంతేకాకుండా 'పవర్ స్టార్' టైటిల్ లోగో మధ్యలో పవన్ కళ్యాణ్ స్థాపించిన 'జనసేన' పార్టీ ఎలక్షన్ సింబల్ అయిన 'గ్లాస్' ని కూడా వాడాడు. పార్టీ సింబల్ సినిమా టైటిల్ లో యూస్ చేయడంపై జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా వర్మని విమర్శిస్తున్నారు. ఇక 'ఎన్నికల ఫలితాల తర్వాత కథ' అని వర్మ ప్రకటించడంతో.. పవన్ కళ్యాణ్ 2019 సార్వత్రిక ఎన్నికలలో ఓటమి పాలై.. తదనంతర పరిమాణాలతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం లాంటి విషయాలు ప్రస్తావిస్తారేమో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో 'పవర్ స్టార్' సినిమా విషయంలో ఎలాంటి వివాదాలు తలెత్తుతాయో చూడాలి.
Tags:    

Similar News