• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆర్టీవీ మరో బాంబు.....

ఆర్టీవీ మరో బాంబు.. లోకేష్ కు పవన్ ఓదార్పు

By - Tupaki Desk
Update: 2019-11-05 09:20 GMT
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ఇప్పటికే చంద్రబాబును చెడుగుడు ఆడేసిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు తాజాగా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాతో ఆయన నెత్తిన బాంబు వేసేందుకు రెడీ అయ్యారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఏపీలో విడుదల కాకుండా నాటి సీఎం చంద్రబాబు అడ్డుకొని వర్మను కెలికాడన్నది అందరికీ తెలిసిందే. వర్మ లాంటి మనిషినే కెలికితే ఎలా ఉంటుందో ఇప్పుడు చంద్రబాబు అర్థమవుతోంది. ఇప్పుడు  వర్మ వంతు వచ్చింది. ఏపీలో చంద్రబాబు ప్రత్యర్థి జగన్ అధికారంలో ఉండడంతో వర్మ ఊహలకు పట్టపగ్గాలు లేకుండా చెలరేగిపోతున్నారు.

తాజాగా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా ఏపీ రాజకీయాలపైనే వర్మ సంధిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు, జగన్ మొన్నటి ఎన్నికల వాతావరణాన్నే కథగా మలిచారు. ఇప్పటికే చంద్రబాబు, పవన్ , కేఏ పాల్ ఫస్ట్ లుక్ లను, పాటలను రిలీజ్ చేసిన వర్మ తాజాగా నారా లోకేష్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. అచ్చు గుద్దినట్లు వారికి సరిపోయే నటులను ఎంపిక చేసి వర్మ దించేస్తున్నారు.

తాజాగా వర్మ రిలీజ్ చేసిన పోస్టర్ వైరల్ గా మారింది. నారా లోకేష్ ను పవన్ కళ్యాణ్ ఓదార్చుతున్నట్లుగా ఉన్న ఒక పిక్ ను వర్మ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. 'రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే' అని కొటేషన్ ఇచ్చారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. టీడీపీ, జనసేన వర్గాల్లో చర్చనీయాంశమైంది.

వివాదాలతోనే సినిమాకు బాగా పబ్లిసిటీ తెచ్చుకుంటున్న వర్మ ప్రధానంగా చంద్రబాబు, పవన్, నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ కోవలోనే నారాలోకేష్ ఏడుస్తుంటే పవన్ ఓదార్చే ఫొటోను రిలీజ్ చేసి దుమారం రేపారు. రాజకీయ వేడి రగిలిస్తున్న ఈ సినిమా తెలుగు నాట విడుదలైతే ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందనేది ఆసక్తిగా మారింది.
Tags:    
  • Ram Gopal Varma 
  • Chandra Babu Naidu 
  • Youtube 
  • Kamma Rajyam Lo Kadapa Reddlu 
  • Nara Lokesh 
  • Pavan Kalyan 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS