ఆర్జీవీ క‌ళ్లు అందంగా బాతు గుడ్ల‌లాగా ఉంటాయ‌న్న యాంక‌ర్!

Update: 2021-05-08 03:30 GMT
ఎవ‌రైనా అంద‌మైన‌ అమ్మాయి ప్రేమిస్తున్నాను పెళ్లాడ‌తాను అని అంటే ఆర్జీవీ అయితే ఏం చెబుతారు? అంటే.. ఆయ‌న ఏ అమ్మాయిని అయినా ప్రేమిస్తార‌ట‌. ఒక‌ప్పుడు స్త్రీని ప్రేమించాను. ఇప్పుడు స్త్రీల‌ను ప్రేమిస్తున్నాను! అని ఆర్జీవీ తెలిపారు. కానీ ఎవ‌రినీ పెళ్లి చేసుకోరట‌. ఇంత‌కుముందు ఎవ‌రినైనా కొన్ని సంవ‌త్స‌రాలు ప్రేమించారు.. ఎఫైర్ సాగించారు. త‌ర్వాత రోజులు ప్రేమించారు. ఇప్పుడు గంట‌లు మాత్ర‌మే ప్రేమ‌కు అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. మ‌హా అయితే 2- 3 గంట‌లే ప్రేమిస్తారట‌.

నేను జెన్యూన్ గా చేసే ప‌నిని గాళ్స్ ఇష్ట‌ప‌డ‌తాను. నిజాయితీగా సెక్స్ చేస్తాను. అందుకే న‌న్ను అమ్మాయిలు ఇష్ట‌ప‌డ‌తార‌ని కూడా ఆర్జీవీ చెప్పారు. అవి నాలో న‌చ్చ‌డం వ‌ల్ల‌నే ఎవ‌రూ బ‌య‌ట పెట్ట‌లేద‌ని కూడా వెల్ల‌డించారు. ఇక ప్రేమించ‌డం తాళి గురించి ఆయ‌న త‌న‌దైన శైలిలో వ్యంగ్యంగానే మాట్లాడారు. నేను ఇదీ అని చెప్పేస్తాను కాబ‌ట్టి అమ్మాయిల‌కు చాలా ఈజీ ప్ర‌తిదీ అని కూడా వ‌ర్మ అన్నారు.

ఇంత‌కుముందు దిల్లీ నుంచి వచ్చిన ఓ అమ్మాయితో గ‌డిపాన‌ని కూడా చెప్పిన వ‌ర్మ‌.. ఆ అమ్మాయి అప్పుడే గెలిచిన‌ ఆప్ పార్టీ గొప్ప గురించి చెబుతుంటే త‌న‌కు చిర్రెత్తింద‌ని ఆ అన‌వ‌స‌ర శ‌బ్ధాల వ‌ల్ల ఆమె తొడ‌ల సౌంద‌ర్యాన్ని ఆస్వాధించే అవ‌కాశం లేకుండా డిస్ట్ర‌బ్ అయ్యాన‌ని కూడా త‌న‌తో అన్నార‌ట‌. ఆప్ పార్టీ కంటే త‌న తొడ‌ల సౌంద‌ర్యం అంత ఆక‌ర్ష‌ణీయంగా ఉంద‌ని త‌న‌తో ఆ రోజంతా గ‌డిపాన‌ని తెలిపారు. ఇక ఇలాంటి ప్ర‌యివేటు విష‌యాలెన్నో ఆ లేడీ యాంక‌ర్ కి చెప్పారు ఆర్జీవీ.

ఈ ఇంట‌ర్వ్యూలో ఇంకో ట్విస్టు కూడా ఉందండోయ్! ఆర్జీవీ క‌ళ్లు అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని బాతు గుడ్ల‌లాగా ఉంటాయ‌ని ఆ యాంక‌ర్ పొగిడేయ‌డం ఈ ఇంట‌ర్వ్యూలో మ‌రో కొస‌మెరుపు!! మీరు చాలా బావున్నారు! అంటూ ఆర్జీవీనే కంగారు పెట్టేశారు స‌ద‌రు యాంకర్.
Tags:    

Similar News