స్టార్ హీరోని ఆ రకంగా చిత్రహింసలు పెట్టిన తండ్రి!
యానిమల్ చిత్రం ఘనవిజయం సాధించడంలో ఆ సినిమా కథాంశం, ఎమోషనల్ డెప్త్ ప్రధాన కారణం.;
యానిమల్ చిత్రం ఘనవిజయం సాధించడంలో ఆ సినిమా కథాంశం, ఎమోషనల్ డెప్త్ ప్రధాన కారణం. తండ్రి కొడుకుల మధ్య సంఘర్షణను సందీప్ వంగా తెరకెక్కించిన తీరు ప్రశంసలు అందుకుంది. కొన్ని అద్భుతమైన ఎమోషనల్ సీన్స్, రణబీర్ కపూర్ ఎమోషనల్ పెర్ఫామెన్స్ సినిమానిక ప్రధాన బలం. మహిళలపై విద్వేషం చాలామందికి నచ్చలేదు కానీ, తండ్రి - కొడుకు మధ్య ఎమోషనల్ డెప్త్, విలన్‌తో హీరో హోరాహోరీ యుద్ధం అందరికీ కనెక్టయింది. అందుకే ఆ సినిమా అంత పెద్ద విజయం సాధించింది.
అయితే యానిమల్ చిత్రంలోని పాత్రతో రణబీర్ కపూర్ నిజ జీవితం కొంత ముడిపడి ఉందని కూడా చెబుతారు. ఆ సినిమాలో తన తండ్రితో ఎలా ఘర్షణ పడతాడో, అదేవిధంగా రణబీర్ నిజ జీవితంలో కూడా తన తండ్రి రిషీ కపూర్ తో అంతే ఘర్షణ పడ్డాడు అని కూడా సన్నిహితులు చెబుతారు. అందరి ముందు రిషీకపూర్ తనను తిట్టినప్పుడు రణబీర్ ఎమోషన్ సినిమాలోలానే ఉంటుంది.
అయితే నిజ జీవితంలో రణబీర్ కపూర్ ఇంకా చాలా ఎదుర్కొన్నాడు. అతడు అమెరికాలో నటశిక్షణకు సంబంధించిన కోర్స్ చదువుకునేప్పుడు తనకు తినడానికి, అప్పుడప్పుడు మెక్ డొనాల్డ్స్ లో నచ్చిన ఆహార పదార్థాలు కొనుక్కోవడానికి మాత్రమే తన తండ్రి రిషీ కపూర్ డబ్బును పంపేవాడు. అది పరిమితంగా ఉండేది. దానివల్ల రణబీర్ జల్సాలు చేయడానికి లేదా ఇష్టానుసారం తిరగడానికి అవకాశం లేదు. అతడిని ఒక స్టార్ కిడ్ లా దుబారాగా పెంచలేదు రిషీజీ. ఈ విషయాన్ని రణబీర్ కపూర్ తాజా పాడ్ కాస్ట్ లో స్వయంగా వెల్లడించాడు.
రణబీర్ జీవితంలో ఎన్నో పరీక్షలకు గురయ్యాడు. అవన్నీ ఆర్థిక పాఠాలు నేర్పించాయి. రణబీర్ నటనా పాఠశాలలో చదువుతున్నప్పుడు ఇతర విద్యార్థుల మాదిరిగానే సాధారణ యువకుడిలా జీవించవలసి వచ్చింది. అతడి పాకెట్ మనీ చాలా పరిమితంగా ఉంది.. భోజనం చేయాలి లేదా కనీస విందు కోసం మెక్‌డొనాల్డ్స్ కి వెళ్లడం వరకూ మాత్రమే డబ్బు సరిపోతుంది.
రణబీర్ భారతదేశానికి తిరిగి వచ్చాక కూడా కఠినమైన పాఠాలు ఆగలేదు. `బ్లాక్` సినిమా కోసం సంజయ్ లీలా భన్సాలీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించినప్పుడు మరోసారి రియాలిటీ చెక్ ని ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో రణబీర్ కి కార్ లేకుండా తీసుకెళ్లిపోయాడు రిషీజీ. దాంతో అతడు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా ప్రయాణించవలసి వచ్చింది. తన కొడుకు సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేలా తన పాకెట్ మనీని కపూర్ పూర్తిగా ఆపేశాడు. అయితే ఇది శిక్ష కాదు.. కేవలం ఆర్థిక పాలనకు సంబంధించిన పాఠాలు మాత్రమేనని రణబీర్ తాజా పాడ్ కాస్ట్ లో తెలిపాడు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే, రణబీర్ కపూర్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తున్నాడు. తదుపరి సంజయ్ లీలా భన్సాలీ లవ్ & వార్‌లో కనిపిస్తాడు. ఇందులో అలియా భట్, విక్కీ కౌశల్ ఇతర కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. నితేష్ తివారీ ప్రతిష్టాత్మక చిత్రం `రామాయణం`లో రణబీర్ శ్రీరాముడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది. సందీప్ రెడ్డి వంగా యానిమల్ సీక్వెల్ `యానిమల్ పార్క్`లో కూడా అతను రణవిజయ్‌గా తిరిగి నటిస్తాడు. అలాగే యష్ రాజ్ ఫిలింస్ `ధూమ్ 4` కోసం చర్చలు జరుపుతున్నాడు. అయాన్ ముఖర్జీతో బ్రహ్మాస్త్ర 2 గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. 2026లో నాలుగు భారీ పాన్ ఇండియా చిత్రాలతో కెరీర్ పరంగా రణబీర్ ఫుల్ బిజీగా ఉన్నాడు.