మౌని, దిశ మధ్య ఏం నడుస్తోంది?

బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్, దిశా పటానీ.. తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే.;

Update: 2026-01-02 06:57 GMT

బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్, దిశా పటానీ.. తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. అందం, అభినయంతో ఇప్పటికే వారిద్దరూ స్పెషల్ ఫ్యాన్ బేస్ తో పాటు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. ఎప్పుడూ నెట్టింట యాక్టివ్ గా ఉంటూ కొత్త కొత్త పిక్స్ తో సందడి చేస్తుంటారు ఇద్దరూ.

అయితే గత కొంతకాలంగా మౌని రాయ్, దిశా పటానీ కలిసి ఎక్కువగా కనిపిస్తున్నారు. వెకేషన్లు, బర్త్ డే సెలబ్రేషన్లు, స్పెషల్ అకేషన్లు.. అలా ఎక్కడ చూసినా ఇద్దరూ కలిసి ఉండడం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో షేర్ చేసే ఫోటోల్లో కనిపించే కెమిస్ట్రీపై నెటిజన్లు, సినీ ప్రియులు ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతూనే ఉన్నారు.

హాలీడే ట్రిప్స్‌ నుంచి పర్సనల్ మూమెంట్స్‌ వరకూ ఇద్దరూ విడదీయరాని పక్షుల్లా కనిపించడంతో… ఇది కేవలం ఫ్రెండ్షిప్‌ మాత్రమేనా? అని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. దీంతో ఎప్పటికప్పుడు వీరి బంధం స్నేహానికి మించినదేమోనన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై మౌని, దిశా పలుమార్లు రెస్పాండ్ అయ్యారు.

తాము మంచి స్నేహితులమని చెప్పారు. జస్ట్ ఫ్రెండ్స్ అని వారిద్దరూ.. ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. కానీ కలిసి కనిపించే ప్రతి ఫోటో, ప్రతి ట్రిప్, ప్రతి పోస్ట్‌ చూసి మాత్రం నెటిజన్లు.. అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా దిశ, మౌని తమ పార్టనర్స్ తో గోవాకు వెళ్లగా.. అందుకు సంబంధించిన పిక్స్ ను పోస్ట్ చేశారు.

వాటిలో వారిద్దరూ ఉన్న పిక్స్ మాత్రం అందరినీ ఆకట్టుకున్నాయి. క్యాప్షన్ కూడా అట్రాక్ట్ చేసింది. దీంతో వారి మధ్య రిలేషన్ కోసం మళ్లీ చర్చించుకుంటున్నారు. నిజానికి.. మౌని రాయ్ ఇప్పటికే బిజినెస్ మ్యాన్ సూరజ్ నంబియాన్ ను పెళ్లి చేసుకున్న సంగతి విదితమే. కానీ ఆమెకు సంబంధించిన లైఫ్ ఈవెంట్స్ లో దిశా సందడి చేస్తూనే ఉంటోంది.

అదే సమయంలో దిశకు ఇప్పటికే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతడు ఫారిన్ లో ఉంటాడని సమాచారం. కానీ ఆమెకు సంబంధించిన ప్రతి లైఫ్ ఈవెంట్ లో కూడా మౌని రాయ్ కచ్చితంగా కనిపిస్తుంది. ఏదేమైనా దిశా పటానీ, మౌని రాయ్ మధ్య రిలేషన్ ఏంటన్నది వారిద్దరికి తెలియాలి. క్లోజ్ ఫ్రెండ్ షిప్పా లేక ఇంకేమైనా ఉందా అనేది వారికే తెలుస్తుంది.

సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై అటు అభిమానులు.. ఇటు సినీ ప్రియుల్లో ఆసక్తి ఉండటం సహజమే. దీంతో ఎప్పటికప్పుడు రూమర్స్ స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. సోషల్ మీడియాలో డిస్కషన్లు జరుగుతూనే ఉంటాయి. మొత్తానికి దిశా పటానీ, మౌని రాయ్ రిలేషన్ ఇప్పుడు ఒక డిస్కసింగ్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News