ప్రభాస్ పెళ్లి.. ఇంట్రెస్టింగ్ మ్యాటరే కానీ..?

ప్రభాస్ ని చూసుకుని మరికొంతమంది పెళ్లి విషయంలో లేట్ చేస్తున్నారు. రీసెంట్ గా అనగనగా ఒక రాజు హీరో నవీన్ పొలిశెట్టి కూడా పెళ్లెప్పుడు అంటే ప్రభాస్ మ్యారేజ్ తర్వాతే అని అన్నాడు.;

Update: 2026-01-02 06:56 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో అతని పెళ్లి మ్యాటర్ ని హైలెట్ అవ్వకుండా చేశారు. మొన్నటిదాకా ప్రభాస్ పెళ్లిపై అటు మీడియాలో ఇటు ఆడియన్స్ లో ఒక రేంజ్ లో డిస్కషన్స్ జరిగాయి. రీసెంట్ గా రాజా సాబ్ ఈవెంట్ లో కూడా యాంకర్ సుమ ప్రభాస్ పెళ్లి ప్రస్తావన తెచ్చింది. ఐతే ప్రభాస్ పెళ్లి అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్ అయినా అది విని విని ఆడియన్స్ కి బోర్ కొట్టేసింది. అంతకన్నా ప్రభాస్ చేస్తున్న సినిమాలు ఎక్కువ హైప్ ఎక్కిస్తున్నాయి.

మిగతా హీరోలు ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రమే..

టాలీవుడ్ నుంచి ప్రభాస్ ఒక్కడే దాదాపు అరడజను సినిమాల దాకా లైన్ లో పెట్టాడు. ఒకదాన్ని మించి మరొకటి అనేలా ఈ సినిమాలు ఉన్నాయి. మిగతా హీరోలు ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రమే లైన్ లో పెట్టగా ప్రభాస్ ఒక్కడే వరుస పాన్ ఇండియా సినిమాలతో అదరగొట్టేస్తున్నాడు. ఐతే ప్రభాస్ పెళ్లి కన్నా ఇప్పుడు అతను చేసే సినిమాల మీదే ఫ్యాన్స్ ఎక్కువ క్రేజీగా ఉన్నారు.

బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కూడా స్టిల్ బ్యాచిలర్ గా ఉన్నారు. పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా వారు జీవితాంతం బ్యాచిలర్ గానే ఉండిపోయారు. ఐతే ప్రభాస్ అలా బ్యాచిలర్ గా ఉంటాడని కాదు కానీ ఎంతో గొప్ప గొప్ప వాళ్లే పెళ్లి విషయంలో లేట్ అయినప్పుడు డార్లింగ్ ప్రభాస్ లేట్ చేయడంలో తప్పులేదు.

ప్రభాస్ ని చూసుకుని మరికొంతమంది పెళ్లి విషయంలో లేట్..

ప్రభాస్ ని చూసుకుని మరికొంతమంది పెళ్లి విషయంలో లేట్ చేస్తున్నారు. రీసెంట్ గా అనగనగా ఒక రాజు హీరో నవీన్ పొలిశెట్టి కూడా పెళ్లెప్పుడు అంటే ప్రభాస్ మ్యారేజ్ తర్వాతే అని అన్నాడు. అంటే ఈ హీరోలంతా కూడా పెళ్లి కన్నా వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే ముందు లక్ష్యంగా పెట్టుకున్నారు.

టాలీవుడ్ లో ప్రభాస్, రామ్, నవీన్ పొలిశెట్టి, విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ ఇలా స్టార్ హీరోల నుంచి యువ హీరోల దాకా పెళ్లి విషయంలో టైం తీసుకుంటున్నారు. మిగతా పరిశ్రమల్లో కూడా ఇలానే కొంతమంది హీరోలు పెళ్లి కాదు కెరీర్ ముఖ్యమని చెబుతున్నారు. ఐతే ప్రభాస్ పెళ్లిపై దాదాపు పదేళ్లుగా డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయి. బాహుబలి టైం లోనే ఈ సినిమా పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని ప్రభాస్ చెప్పాడు. కానీ అది జరగలేదు. ప్రభాస్ దారిలోనే కొంతమంది యువ హీరోలు కూడా మా ముందు ప్రభాస్ ఇంకా స్టిల్ బ్యాచిలర్ గా ఉన్నాడు. ఆయన పెళ్లి చేసుకున్నాకే మా పెళ్లి అంటున్నారు.

టాలీవుడ్ లో ప్రభాస్ తో పాటు పెళ్లి ఈడు దాటినా పెళ్లి చేసుకోని హీరోలు చాలామంది ఉన్నారు. అందుకే వారి పెళ్లి టాపిక్ కన్నా వారు చేస్తున్న ఇంట్రెస్టింగ్ సినిమాల గురించి డిస్కషన్ చేస్తున్నారు.

Tags:    

Similar News