శంకర వరప్రసాద్‌ కోసం 'పెద్ది' త్యాగం...!

కొత్త ఏడాది సందర్భంగా ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న చాలా సినిమాలకు సంబంధించిన పోస్టర్స్‌, టీజర్స్‌, ఇంకా రకరకాల ప్రమోషన్‌ స్టఫ్ ను విడుదల చేయడం జరిగింది.;

Update: 2026-01-02 06:49 GMT

కొత్త ఏడాది సందర్భంగా ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న చాలా సినిమాలకు సంబంధించిన పోస్టర్స్‌, టీజర్స్‌, ఇంకా రకరకాల ప్రమోషన్‌ స్టఫ్ ను విడుదల చేయడం జరిగింది. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ పలు పోస్టర్స్ వచ్చాయి. కానీ రామ్‌ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. కనీసం రామ్‌ చరణ్‌ కొత్త పోస్టర్‌ వస్తుందని అంతా ఆశించారు. కానీ రామ్‌ చరణ్‌ అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేసే విధంగా సినిమా పోస్టర్‌ కాదు కదా కనీసం చిన్న అప్‌డేట్‌ కూడా ఇవ్వలేదు. దాంతో మెగా ఫ్యాన్స్ ముఖ్యంగా చరణ్‌ ఫ్యాన్స్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సినిమా పూర్తి చేసిన బుచ్చిబాబు ప్రమోషన్‌ విషయంలో నెమ్మదిగా ఉండటం ఏమాత్రం కరెక్ట్‌ కాదంటూ చాలా మంది విమర్శిస్తున్నారు. అయితే కొత్త సంవత్సరం కానుక రాకపోవడం వెనుక వేరే కారణం ఉందని తెలుస్తోంది.

మన శంకరవరప్రసాద్‌ గారు సినిమా సంక్రాంతికి...

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్‌ గారు' సినిమాను విడుదల చేయబోతున్నారు. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొత్త ఏడాదిలోనూ ఆ సినిమా నుంచి వరుస ప్రమోషనల్‌ వీడియోలు, ఫోటోలు వచ్చాయి. ఇలాంటి సమయంలో శంకర వరప్రసాద్‌ నుంచి ప్రేక్షకుల దృష్టిని మరల్చడం ఇష్టం లేకపోవడం వల్లే పెద్ది నుంచి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు అనేది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్‌. కొత్త సంవత్సరం అనేది ఖచ్చితంగా చాలా ముఖ్యమైన సందర్భం అనడంలో సందేహం లేదు. అలాంటి సందర్భంలో సినిమా నుంచి పోస్టర్‌ను విడుదల చేస్తే కచ్చితంగా మంచి రీచ్ ఉంటుంది. అయినా కూడా మెగాస్టార్‌ కోసం మెగా పవర్‌ స్టార్‌ సినిమా ను కాస్త సైలెంట్‌ చేసి పెట్టారు. ఎప్పుడైతే మన శంకరవర ప్రసాద్‌ గారు బయటకు వస్తారో అప్పటి నుంచి పెద్ది సందడి షురూ అయ్యే అవకాశం ఉంది.

రామ్‌ చరణ్ పెద్ది సినిమాను సమ్మర్‌లో...

కొత్త సంవత్సరం సందర్భంగా పెద్ది త్యాగం చేసి మొత్తం స్పేస్‌ ను మన శంకరవర ప్రసాద్‌ గారు కి ఇచ్చాడు అనేది చాలా మంది అంటున్న మాట. తండ్రి సినిమా కోసం రామ్‌ చరణ్ తన పెద్ది సినిమాను కాస్త సైలెంట్‌ చేశాడు అంతే. అయితే పెద్దికి ఉన్న స్టామినా నేపథ్యంలో విడుదలకు రెండు మూడు వారాల ముందు ప్రమోషన్ మొదలు పెట్టినా కచ్చితంగా రీచ్‌ విపరీతంగా దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే వచ్చిన పాట ఓ రేంజ్‌ లో హిట్‌ అయింది. వెంటనే మరో పాటను విడుదల చేయాల్సి ఉన్నా మన శంకర వరప్రసాద్‌ ప్రమోషన్‌ కి అడ్డు అనే ఉద్దేశంతోనూ పాటను వాయిదా వేశారని తెలుస్తోంది. మొత్తానికి శంకర వరప్రసాద్‌ కోసం పెద్ది చాలా త్యాగం అయితే చేస్తున్నాడు. అందుకు తగ్గట్లుగానే అనిల్ రావిపూడి జోరు మీద ఉండి ప్రమోషన్ చేస్తున్నాడు. తాజాగా నయనతార సైతం కెమెరా ముందుకు వచ్చి ప్రమోషన్‌ వీడియోలో కనిపించింది.

రామ్‌ చరణ్‌, చిరంజీవి సూపర్‌ హిట్‌...

రామ్ చరణ్‌, బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న పెద్ది సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో సమ్మర్‌ లో భారీ ఎత్తున విడుదల చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. బుచ్చిబాబు దర్శకుడిగా ఇది రెండో సినిమానే అయినా కూడా అద్భుతంగా చిత్రీకరించాడు అంటూ మేకర్స్ చెబుతున్నారు. రంగస్థలం తర్వాత చరణ్‌ నుంచి ఆ స్థాయి సినిమా గా ఈ సినిమా నిలుస్తుందని అంతా నమ్మకంగా ఉన్నారు. 2026 లో చరణ్‌ తో పాటు బుచ్చిబాబుకు బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌ దక్కుతుందని మెగా ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్‌ గారు సినిమా రానున్న నేపథ్యంలో చిరంజీవి ఈ ఏడాదిని చాలా గ్రాండ్‌ గా ఆరంభించి, ముందు ముందు రాబోతున్న మెగా సినిమాలకు బూస్ట్‌గా నిలుస్తారని అంతా నమ్మకంగా ఉన్నారు. తండ్రి కొడుకులు ఇద్దరూ ఈ ఏడాది భారీ హిట్స్ కొట్టాలని మెగా ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. మరి మన శంకరవరప్రసాద్‌ గారు, పెద్ది సినిమాలు ఎలా ప్రేక్షకులను మెప్పిస్తాయి, ఎంత మేరకు వసూళ్లు రాబడుతాయి అనేది చూడాలి.

Tags:    

Similar News