హీరోయిన్ సెంటిమెంట్ హీరోకి ప్లస్ అయ్యేనా!
దర్శకులు కంటెంట్ ని ఎంత బలంగా నమ్ముతారా? నిర్మాతలు సక్సెస్ సెంటిమెంట్ ని కూడా అంతే బలంగా విశ్వషిస్తారు.;
దర్శకులు కంటెంట్ ని ఎంత బలంగా నమ్ముతారా? నిర్మాతలు సక్సెస్ సెంటిమెంట్ ని కూడా అంతే బలంగా విశ్వషిస్తారు. సక్సెస్ పుల్ కంటెంట్ తో పాటు, సినిమా రిలీజ్ అయ్యే ముహూర్తం కూడా బాగుండాలి. అప్పుడే అనుకున్న పని దిగ్విజయంగా పూర్తవుతుందన్నది చాలా మంది దర్శక, నిర్మాతలు నమ్ముతారు. అందుకే రిలీజ్ విషయంలో రకరకాల ప్రామాణికాలను దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటారు. ముఖ్యంగా సక్సస్ అన్నది ఎక్కువగా ఏ సీజన్ లో రిపీట్ అవుతుంది? అందుకు కారణమైన వారు ఎవరై ఉంటారు? ఇలా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.
ఈ సంక్రాంతి కానుకగా, నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన `అనగనగా ఒక రాజు` రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. `ది రాజాసాబ్`, `భర్తమహాశయులకు విజ్ఞప్తి`, `మన శంకర వరప్రసాద్ గారు`లాంటి అగ్ర సినిమాలున్నా? రాజు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. రెట్టించిన నమ్మకంతో బరిలోకి దిగుతున్నాడు. `జాతిరత్నాలు` తర్వాత నవీర్ పొలిశెట్టికి సరైన హిట్ పడలేదు. `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి`తో ఓ ప్రయత్నం చేసినా పనవ్వలేదు. దీంతో రెండేళ్ల గ్యాప్ అనంతరం `అనగనగా ఒక రాజు`గా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.
అయితే ఈ సినిమాకు మీనాక్షి చౌదరి సంక్రాంతి సక్సెస్ సెంటిమెంట్ ఎంత వరకూ కలిసొస్తుందో? చూడాలి. గత ఏడాది అమ్మడు నటించిన `సంక్రాంతికి వస్తున్నాం` కూడా సంక్రాంతి సీజన్ కే రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏకంగా 300 కోట్ల వసూళ్లను సాధించింది. అంతకు ముందు `గుంటూరు కారం` 2024 సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో మెయిన్ లీడ్ శ్రీలీల పోషించినా..సెకెండ్ లీడ్ లో మీనాక్షి అలరించింది. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అలా సంక్రాంతి సీజన్ అన్నది మీనాక్షి సక్సెస్ పరంగా కలిసొచ్చింది.
ఈ నేపథ్యంలో మరోసారి యంగ్ హీరోతో కలిసి ఈ సంక్రాంతి రచ్చకు రెడీ అయింది మీనాక్షి. మరి ఈ సెంటిమెంట్ ఈ సారి కూడా కలిసొచ్చేనా? లేదా? అన్నది చూడాలి. కలిసొచ్చిందంటే? సంక్రాంతి రిలీజ్ లకు మీనాక్షి మరింత బ్రాండ్ గా మారిపోతుంది. మీనాక్షి కి సైతం ఈ సక్సెస్ ఎంతో కీలకమైంది. సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ అందుకున్నా? ఆ తర్వాత అవకాశాలు అందుకోవడంలో మాత్రం బాగా వెనుకబడింది. ఆ సినిమాకు సంబంధించి క్రెడిట్ అంతా ఐశ్వర్యా రాజేష్ ఖాతాలోకే వెళ్లింది. దీంతో మీనాక్షి చౌదరి ట్యాలెంట్ ఉన్నా? అవకాశాలు లేక ఖాళీగా గడిపింది. మరి ఈ హిట్ తోనైనా కొత్త ఏడాదిలో బిజీ అవుతుందేమో చూడాలి.