రామూ.. మళ్ళీ 'ఎటాక్‌' ఇచ్చిండు

Update: 2015-10-07 08:23 GMT

Full View

అప్పుడెప్పుడో మంచు మనోజ్‌ పెళ్ళి కాక ముందు మొదలట్టేసి.. అప్పట్లోనే ఈ సినిమా ట్రైలర్‌ ను విడుదల చేసేశారు కూడా.. అయితే ఎందుకో ఆ తరువాత మధ్యలో మన సంచలన వర్మ డిస్‌ కనెక్ట్‌ అయ్యాడు. కిల్లింగ్‌ వీరప్పన్‌ అంటూ బెంగుళూరు వెళ్లొచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ''ఎటాక్‌'' మీద కన్నేశాడు. అందుకే ఈరోజు ఈ సినిమా తాలూకు కొత్త ట్రైలర్‌ ను రిలీజ్‌ చేశాడు.

ఇకపోతే సినిమా ట్రైలర్‌ గురించి మాట్లాడుకోవాలంటే.. యాజ్యూజువల్‌ గా సినిమా మళ్లీ 'రక్త చరిత్ర' టైపులోనే ఉంది. ఆ సినిమా సీమ ఫ్యాక్షన్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో ఉంటే ఈ సినిమా మాత్రం ఓల్డు సిటీ హైదరాబాద్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో సాగుతుందనమాట. గుబురు గెడ్డంతో మంచు మనోజ్‌.. రగ్గడ్‌ లుక్‌ తో జగపతి బాబు.. కొత్తగా విలనవతారం ఎత్తిన వడ్డే నవీన్‌.. యథావిథిగా పొలిటికల్‌ బాస్‌ లా ప్రకాష్‌ రాజ్‌.. సైకో విలన్‌ లా అభిమన్యు సింగ్‌.. అందరూ సేమ్‌ టు సేమ్‌ గతంలో పోషించిన పాత్రలే పోషించారులే. అయితే ట్రైలర్‌ లో ఇంటెన్సిటినీ.. నిర్మాత సి.కళ్యాణ్‌ ప్రొడక్షన్‌ వాల్యూస్‌ కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాని ఎప్పుడూ అదే విధంగా స్పాట్లు పెట్టడం.. నరక్కోవడం.. కాల్చుకోవడం.. ఛాలెంజులూ.. వెన్నుపోట్లు.. అవేనా వర్మ? ట్రైలర్‌ తో ఎటాక్‌ సరే.. ఇంతకీ సినిమా ఎప్పుడు మరి?

ప్రస్తుతానికైతే మంచు మనోజ్‌ ఈ సినిమాను పూర్తి చేసి పక్కనెట్టేసి ఆల్రెడీ దశరథ్‌ సినిమాపై ఫోకస్‌ పెట్టేసుకున్నాడు. మరి ''ఎటాక్‌''తో ఎటాక్‌ నవంబర్‌ లోనే అని రామ్‌ గోపాల్‌ వర్మ చెబుతున్నాడు కాని.. ఇంకా ఏదీ కన్ఫాం కాలేదట.
Tags:    

Similar News