• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మొన్న కాళ్ల మీద...

మొన్న కాళ్ల మీద పడిపోయాడు.. ఇవాళ చెంపదెబ్బ తిన్నాడు

By - Tupaki Desk
Update: 2021-09-03 03:35 GMT
వివాదాలకు.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలవటం రాంగోపాల్ వర్మకు తెలిసినంత బాగా సినిమా ఇండస్ట్రీలో మరెవరికి తెలీదు. దేవుడిచ్చిన తెలివిని ఇష్టానుసారంగా వాడేయటం ఎలానో ఆయన్ను చూసి ఇట్టే తెలుసుకోవచ్చు. తనకు నచ్చిన వారి విషయంలో దేనికైనా రెఢీ అన్నట్లుగా వ్యవహరించే ఆయన.. పాపులార్టీ కోసం ఎవరినైనా ఇట్టే వాడేస్తారు. ఆ వాడకంలో తనకున్న ఇన్నర్ ఇగోను అదే పనిగా సంతృప్తి పర్చుకోవటం ఆయనకున్న బలహీనతగా చెప్పుకోవాలి.

తనకు నచ్చని వారిని తరచూ గుర్తు చేసుకుంటూ.. తద్వారా తన పాపులార్టీని  పెంచుకోవటం.. తన సినిమాలు.. ప్రోగ్రాంల గురించి జనం మాట్లాడుకునేలా చేయటం ఆయనకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదేమో. వర్మను జాగ్రత్తగా గమనిస్తే.. ఆయన చేతిలో పని ఉన్నప్పుడు ఎవరికి అందుబాటులో ఉండరు. ఫోకస్ మొత్తం పని చుట్టూనే తిరుగుతుంటుంది. కానీ.. ఎప్పుడైతే పని పూర్తి అయి.. దాని జనాల ముందుకు తీసుకురావాలని డిసైడ్ అవుతారో.. అప్పుడు మాత్రం ఆయనకు వివాదాలు.. మీడియా అన్ని గుర్తుకు వస్తాయి.

గడిచిన నాలుగైదేళ్లను వర్మనుజాగ్రత్తగా ట్రాక్ చేస్తే ఈ విషయం ఎంతవరకు నిజమన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది. సాధారణంగా తమకు పడని.. నచ్చని వ్యక్తి గురించి ప్రముఖ సెలబ్రిటీలు ఎవరూ మాట్లాడరు. వారి ప్రస్తావన తమ వద్ద రాకుండా చూసుకుంటారు. అందరిలా వ్యవహరిస్తే ఆయన రాంగోపాల్ వర్మ ఎందుకు అవుతారు చెప్పండి. ప్రతి చిన్న దానికి పవన్ కల్యాణ్ ను.. ఆయన ఫ్యాన్స్ ను అదే పనిగా కెలికే అలవాటున్న వర్మ.. తాజాగా పవర్ స్టార్ బర్త్ డేను కూడా వదల్లేదు.

ఈ మధ్యనే బిగ్ బాస్ కమ్ నటి ఆషూరెడ్డితో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూకు సంబంధించిన కొంత ఫీడ్ ను జనాల మీదకు వదిలి.. దాని గురించి అంతా మాట్లాడుకునేలా చేయటం తెలిసిందే. కేఫ్ కమ్ ఐస్ క్రీం పార్లర్ లో పొట్టి డ్రెస్సులో కూర్చున్న ఆషు రెడ్డిని కుర్చీ కిందకు వంగి.. తన సెల్ ఫోన్ తో ఆమె తొడల్ని ఫోటోలు తీసిన క్లిప్ ను విడుదల చేసి.. మరో బోల్డ్ ఇంటర్వ్యూ అంటూ హడావుడి చేయటం.. అది కాస్తా పెద్ద ఎత్తున మీడియాలో రావటం తెలిసిందే.

తాజాగా పవన్ పుట్టిన రోజు సందర్భంగా సదరు బోల్డ్ ఇంటర్వ్యూకు సంబంధించిన 1.32 నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ ను విడుదల చేశారు. అందులో.. కేఫ్ లో ఉన్న ఆషూ వద్దకు వర్మ వెళ్లటం.. తనని తాను పరిచయం చేసుకుంటే.. ఆమె మాత్రం.. వర్మ ఎవరో తెలీదని చెప్పటం.. సినిమాలు చూడవా? అంటే.. చాలా తక్కువ చూస్తానని.. ఇంగ్లిష్ మూవీస్ చూస్తానని చెప్పటం.. దీనికి అతగాడు షాక్ కావటం ప్రోమోలో కనిపిస్తుంది.

నిజాయితీగా చెప్పాలంటే.. ఆషూ తొడలు బాగున్నాయంటూ డైరెక్టుగా చెప్పిన మాటకు.. ఒక ఇంగ్లిషు ఫ.. అంటూ ఒక బూతుమాటను అలవోకగా అనేసి.. ఆ వెంటనే వర్మను చెంపదెబ్బ కొట్టేయంతో చిట్టివీడియో ముగుస్తుంది. పవన్ బర్త్ డే సందర్భంగా ఆషూ రెడ్డి ఇచ్చిన గిప్టు అంటూ.. తనదైన ముదురు తెలివిని ప్రదర్శించాడు. అతగాడు ఆశించినంతనే ఈ ప్రోమో వైరల్ గా మారటం.. అందరి కంట్లో పడటమే కాదు..  

ఈ బోల్డ్ ఇంటర్వ్యూ ఈ నెల ఏడున వస్తుందని చెప్పటం ద్వారా.. అందరూ దాని కోసం వెయిట్ చేసేలా చేశారు. మొన్ననే ఒక పార్టీలో ఫుల్ గా తాగేసి వర్థమాన నటి ఇనయా సుల్తానా కాళ్ల మీద పడిపోయిన వర్మ.. తాజాగా ఆషూరెడ్డి చేత చెంపదెబ్బ తినటం ఒక ఎత్తు అయితే.. ఆ వీడియోను పవన్ పుట్టిన రోజు సందర్భంగా గిప్టు అంటూ.. ఎక్కడో టచ్ అయ్యేలా చేయటం వర్మకే చెల్లుతుందేమో?



Full View






Tags:    
  • ram gopal varma 
  • ram gopal varma movies 
  • ram gopal varma comments 
  • ashu reddy 
  • ashu reddy interview 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS