• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'తులసీ దళం' చిత్రానికి...

'తులసీ దళం' చిత్రానికి సీక్వెల్ గా ఆర్జీవీ 'తులసి తీర్థం'

By - Tupaki Desk
Update: 2021-11-26 06:07 GMT
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వరుస సినిమాతో ఏడాది పొడవునా బిజీగా ఉన్నారు. సినిమాని అనౌన్స్ చేయడమే కాదు.. అంతే ఫాస్ట్ గా సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం బయోపిక్స్ - పొలిటికల్ సెటైరికల్ మూవీస్ - ఫిక్షనల్ రియాలిటీ చిత్రాలు - శృంగారభరిత సినిమాలు - వాస్తవ సంఘటన ఆధారంగా సినిమాలు చేస్తున్న ఆర్జీవీ.. ఒకప్పుడు హారర్ సినిమాలతో ప్రేక్షకులకు ఒణుకుపుట్టించారు. అయితే ఇప్పుడు మరోసారి భయపెట్టడానికి రెడీ అయ్యారు వర్మ. దాని కోసం ఈసారి ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ సహాయం తీసుకుంటున్నారు.

యండమూరి వీరేంద్రనాథ్ రచించిన ‘తులసీ దళం’ నవల మూడు దశాబ్దాల క్రితం యావత్ తెలుగు పాఠకులను ఉర్రూతలూగించింది. సంచలనం సృష్టించిన ఈ నవలతో అప్పట్లో స్టార్ హీరోలకు తీసిపోని ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు యండమూరి. అయితే ఇప్పుడు ‘తులసిదళం’ కు సీక్వెల్ గా ''తులసి తీర్థం'' అనే కథను రచించారు. సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆ కథను అదే టైటిల్ తో తెర మీదకు తీసుకురావాలని సంకల్పించారు.

గురువారం ''తులసి తీర్థం'' చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన ఆర్జీవీ.. యండమూరి వీరేంద్రనాథ్ తో కలిసి టైటిల్ పోస్టర్ ని ఆవిష్కరించారు. భీమవరం టాకీస్ బ్యానర్ పై తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ''నా తదుపరి భయానక చిత్రం 'తులసి తీర్ధం'. యండమూరి వీరేంద్రనాథ్ రచించిన షాకింగ్ నవల 'తులసి దళం' కి సంభావిత సీక్వెల్. దీన్ని భీమవరం టాకీస్ నిర్మింస్తోంది'' అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.

ఇప్పటివరకు తన సొంత కథలతో సినిమాలు తీస్తూ వస్తున్న ఆర్జీవీ.. ఈసారి యండమూరి కథతో ''తులసి తీర్ధం'' సినిమా రూపొందించేందుకు రెడీ అవ్వడంతో అందరి దృష్టి ఈ ప్రాజెక్ట్ పై పడింది. అది కూడా సంచలనాత్మక 'తులసీ దళం' సీక్వెల్ అవడంతో అంచనాలు మొదలయ్యాయి. గ్రాఫిక్స్ ప్రాధాన్యం ఉన్న ఈ హారర్ థ్రిల్లర్ చిత్రాన్ని అతి త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
Tags:    
  • Tulsi Dalam 
  • Sensational Director 
  • Ram Gopal Varma 
  • socialmedia 
  • Bhimavaram Talkies 
  • Horror thriller movie 

Similar News

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

Copyright @2026

Powered by Blink CMS