• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'నగ్నం'తో రాబోతున్న...

'నగ్నం'తో రాబోతున్న సెన్సేషనల్ డైరెక్టర్...!

By - Tupaki Desk
Update: 2020-06-06 11:30 GMT
కాంట్రవర్సీని ఇంటిపేరుగా మార్చుకున్న డైరెక్టర్ రామ్ గోపాల్‌ వర్మ మరో సంచలనానికి తెరతీసారు. ఇప్పుడు ''క్లైమాక్స్'' రూపంలో మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యారు ఆర్జీవీ. విచిత్రమైన ఆలోచనలతో ఎవరూ ఊహించని పనులు చేయడంలో వర్మ ఎప్పుడూ ముందుంటారు. గతంలో శృంగార తార మియా మాల్కోవాతో 'జీఎస్టీ' తీసి సంచలనం సృష్టించిన ఆర్జీవీ ఈసారి 'క్లైమాక్స్' అంటూ మళ్ళీ ఆమెనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. లాక్ డౌన్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్స్, టీజర్ ఓ రేంజ్ లో అలజడి సృష్టించాయి. ఈ సినిమాని రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎక్కడ తీశాడో ఎవరికీ తెలియదు. కాగా డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా ‘క్లైమాక్స్‌’ సినిమాని విడుద‌ల చేస్తున్నాడు ఆర్జీవీ. 'క్లైమాక్స్' మూవీని ఈ రోజు రాత్రి 9 గంటలకు 'ఆర్జీవీ వరల్డ్' ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అంటే ఈ సాయింత్రం నుంచే క్లైమాక్స్ ర‌చ్చ మొద‌లు కానుందన్నమాట. ఒక్కో వ్యూ కోసం 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని వర్మ ఇప్పటికే పేర్కొన్నారు. 'పే ఫర్ వ్యూ' విధానం ఇక్కడ అమల్లో ఉంటుందన్న మాట. ఇది వర్క్ అవుట్ అయితే ఇక నుంచి ఆర్జీవీ త‌న సినిమాలన్నీ ఇలానే రిలీజ్ చేద్దామ‌ని ఫిక్స‌య్యాడు.

ఇదిలా ఉండగా వర్మ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలని తన గుప్పిట్లో పెట్టుకొని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో 'కరోనా' అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. దీని తర్వాత తాను తీయబోయే సినిమా విశేషాలు ప్రకటించేశాడు ఆర్జీవీ. తాజాగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ సినిమా 'నగ్నం' అనే పేరుతో తెరకెక్కబోతోందని వెల్లడించాడు. టైటిల్ తగ్గితే కావాల్సినంత 'నగ్నం' ఈ సినిమాలో ఉంటుందని.. మీకు కావాల్సినంత సెన్సేషన్ న్యూస్ దొరికేంత స్టఫ్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే వెబ్ కంటెంట్ కి సెన్సార్ లేకపోవడంతో రెచ్చిపోయి సినిమాలు తీస్తున్న వర్మ.. సినిమా పేరే 'నగ్నం' అని పెట్టాడంటే ఎలాంటి కంటెంట్ తో రాబోతున్నాడో అర్థం చేసుకోవచ్చు. సినీ రాజకీయ ప్రముఖుల లైఫ్ ఇన్సిడెంట్స్ అయినా.. శృంగార తారల లైఫ్ హిస్టరీ అయినా.. ఎన్కౌంటర్ చేయబడిన వ్యక్తుల జీవితాలైనా.. గ్యాంగ్ స్టర్ స్టోరీలనైనా తనదైన శైలిలో సినిమాగా తెరకెక్కించే ఆర్జీవీ 'నగ్నం'తో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేయబోతున్నాడో చూడాలి.
Tags:    
  • RGV 
  • New project 
  • Nagnam 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS