• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైలర్: ఆర్జీవీ హాట్...

ట్రైలర్: ఆర్జీవీ హాట్ మార్షల్ ఆర్ట్స్ 'అమ్మాయి' వచ్చేసింది..!

By - Tupaki Desk
Update: 2021-11-13 16:20 GMT
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ''లడకీ''. 'ఎంటర్ ది గర్ల్ డ్రాగన్' అనేది దీనికి ట్యాగ్ లైన్. ఇండో-చైనీస్ జాయింట్ వెంచర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. చైనాలో 'డ్రాగన్ గర్ల్' అనే పేరుతో రిలీజ్ అవుతున్న ఈ మూవీ.. తెలుగులో ''అమ్మాయి'' అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇటీవల విడుదల చేసిన హిందీ - చైనీస్ ట్రైలర్లు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం తెలుగు వెర్షన్ ''అమ్మాయి'' ట్రైలర్ ను మేకర్స్ ఆవిష్కరించారు. ఇండియాలోని ఫస్ట్ ఫిమేల్ మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ పూజా భాలేకర్ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. మార్షల్ ఆర్ట్స్ హీరో బ్రూస్ లీ స్ఫూర్తితో ఫైటర్ గా మారిన ఓ యువతి జీవితంలో చోటుచేసుకున్న సంఘటన సమూహారమే ఈ సినిమా అని తెలుస్తోంది.

యాక్షన్ తో పాటుగా ఆర్జీవీ తర్వాత లవ్ - రొమాన్స్ వంటి కుర్రకారుని ఊర్రూతలూగించే మసాలా అంశాలన్నీ 'అమ్మాయి' సినిమాలో ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. పూజా భలేకర్ ఫైటర్ గా ఓ వైపు ఫైట్స్ తో అదరగొడుతూనే.. మరోవైపు అదే స్థాయిలో అందాలను ఆరబోస్తోంది. ఇప్పటికే విడుదలైన పుజా ఫొటోలు - వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం రేపగా.. ఇప్పుడు ట్రైలర్ నెట్టింట హీట్ పెంచేసింది.

''అమ్మాయి'' ఇండియాలోనే ఫస్ట్ రియలిస్టిక్ మార్షల్ ఆర్ట్స్ మూవీ అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. బ్రూస్ లీ 'ఎంటర్ ది డ్రాగన్' సినిమా స్పూర్తితో ఆర్జీవీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ ను పూజా భలేకర్ - వర్మ కలిసి డిజైన్ చేశారు. రవి శంకర్ - డీఎస్ఆర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. మాలహార్ భట్ జోషి సినిమాటోగ్రఫీ అందించారు. చైనాకు చెందిన బిగ్ పీపుల్ సంస్థతో కలిసి ఆర్ట్ సి మీడియా - పారిజాత మూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.


Full View
Tags:    
  • RGV 
  • AMMAYI 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS