ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్‌ ఒకప్పుడు..!

Update: 2021-06-26 17:30 GMT
బాలీవుడ్‌ హీరోయిన్స్‌ లో ఎక్కువ శాతం మంది ప్రస్తుతం ఒక్కో సినిమా కు మూడు నుండి పది కోట్లు అంతకు మించి తీసుకునే వారు కూడా ఉన్నారు. సినిమా రేంజ్ ను బట్టి.. వారి కాల్షీట్స్ ను బట్టి పారితోషికంను డిమాండ్‌ చేస్తూ ఉన్నారు. బాలీవుడ్‌ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్‌ లో ప్రియాంక చోప్రా.. దీపిక పదుకునే.. ఆలియా భట్ ఇంకా కొందరు ఉన్నారు. వీరు ఒక్కో సినిమా కు అందుకునే పారితోషికం సౌత్‌ హీరోల పారితోషికంను మించి ఉంటుందని టాక్‌. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్న ఈ స్టార్‌ హీరోయిన్స్‌ ఒకప్పుడు ఎంత పారితోషికం తీసుకునే వారు.. అసలు వీరి మొదటి పారితోషికం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం.

ప్రియాంక చోప్రా మొదటి సంపాదన 5 వేల రూపాయలు. తన మొదటి సంపాదనను ప్రియాంక చోప్రా ఆ సమయంలో తన తల్లికి ఇచ్చిందట. అప్పట్లో 5 వేలు అంటే చాలా పెద్ద మొత్తమే. ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ లను కూడా చేస్తూ వందల కోట్లను సంపాదిస్తుంది. ఇక స్టార్‌ కిడ్‌ ఆలియా భట్‌ కు మొదటి నుండి కూడా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేదు. ఆమె మొదటి సంపాదన సినిమాతోనే వచ్చింది.

ఆలియా భట్ తన మొదటి సంపాదనను తన అవసరాలకే వినియోగించుకుందట. ఇక సోనమ్‌ కపూర్ హీరోయిన్ గా చేయడానికి ముందు అసిస్టెంట్‌ డైరెక్టర్ గా చేసింది. ఆ సమయంలో ఆమెకు వచ్చే సాలరీ ఆమె ఖర్చులకు కూడా సరిపోయేది కాదట. నెల నెల వచ్చే డబ్బుకు తోడు ఇంట్లో పాకెట్‌ మనీ కూడా తీసుకునేదట.

ఇక కంగనా రనౌత్‌ తాను సంపాదించుకున్న మొత్తంను కాస్ట్యూమ్స్ కొనుగోలు చేసేందుకు ఖర్చు చేసిందట. రూ.50 వేల ఖర్చు చేసి మరీ కంగనా తన కాస్ట్యూమ్స్ ను కొనుగోలు చేసిందట. ఇక రిచా చద్దా తన చిన్న తనంలో దూరదర్శన్ లో ఒక కార్యక్రమంలో చేసినందుకు గాను రూ.200 పొందింట. ఆ సమయంలో తాను చిన్న పాపను కనుక తండ్రి చేతిలో ఆ డబ్బు పెట్టినట్లుగా రిచా చెప్పుకొచ్చింది.

ఇక సల్మాన్ ఖాన్‌ కు జోడీగా హీరోయిన్ గా మొదటి ఆఫర్‌ ను దక్కించుకున్న సోనాక్షి సిన్హా పాతిక లక్షల పారితోషికం అందుకుందట. ప్రస్తుతం కోట్ల పారితోషికం తీసుకుంటున్న ఆమె తన మొదటి పారితోషికంను సల్మాన్ ట్రస్ట్‌ కు విరాళంగా ఇచ్చేసిందట. మొత్తానికి ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్స్‌ అప్పట్లో మాత్రం కొద్ది మొత్తంలోనే సంపాదిస్తూ వారి వారి అవసరాలను తీర్చుకుంటూ ఉండేవారు.
Tags:    

Similar News