డైవోర్స్ లాయ‌ర్ కుటుంబ‌రావు మింగేస్తాడేమో!

Update: 2021-08-12 07:49 GMT
మోడ్ర‌న్ ట్రెండ్ లో విడాకులు చాలా కామ‌న్ వ్య‌వ‌హారం అయిపోయింది. జంట‌ల మ‌ధ్య అండ‌ర్ స్టాండింగ్ విష‌య‌మై చాలా క‌న్ఫ్యూజ‌న్ ఉంది. పూరి చెప్పిన‌ట్టు భాగ‌స్వాముల మ‌ధ్య గొడ‌వ‌లకు కార‌ణం `ఆశ కొద్దీ భారీ ఎక్స్ పెక్టేష‌న్లే`న‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. కొత్తగా పెళ్ల‌యిన జంట‌ను ఒంట‌రి దీవిలో వ‌దిలేస్తే ప‌దిరోజుల‌కే విడాకులు తీసుకోవ‌డం గ్యారెంటీ అంటూ పూరి మ్యూజింగ్స్ లో చెప్పారు.

అదంతా స‌రే కానీ ఇటీవ‌ల సుమంత్ `మ‌ళ్లీ మొద‌లైంది` అనే కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. విడాకుల త‌ర్వాత జీవితంపై సినిమా ఇది. విడాకులిచ్చాక రెండో పెళ్లి చేసుకోవాలా వ‌ద్దా? అన్న‌ది వినోద‌భ‌రితంగా చెబుతున్నార‌ట‌. మ‌రి ఇలాంటి విడాకుల సినిమాలో పోసాని లాంటి న‌టుడిని దించితే ర‌చ్చ మామూలుగా ఉంటుందా? ఆయ‌న ఏకంగా డైవోర్స్ కేసులు డీల్ చేసే ఫ్యామిలీ లాయ‌ర్ గా క‌నిపించ‌నున్నారు అంటే ఆ ర‌చ్చే వేరు.

తాజాగా కుటుంబ‌రావు లుక్ ని చిత్ర‌బృందం రిలీజ్ చేసింది. `ది డైవోర్స్ లాయ‌ర్` అని పోసాని బోర్డ్ పెట్టుకుని మ‌రీ తిరిగేస్తున్నారు. ``ఫ్యామిలీ మ్యాన్` ఫైట్స్ ఫ‌ర్ హజ్బెండ్స్.. ఆస్క్స్ ఫ‌ర్ డిస్కౌంట్స్ ఎట్ రెస్టారెంట్స్.. తాగి తూగే ఫేవ‌రెట్ ప్లేస్ టెర్రాస్`` అంటూ పోసాని పాత్ర గురించి చాలానే ఇంట్ర‌డ‌క్ష‌న్ ఇచ్చారు. ఎన్టీఆర్ టెంప‌ర్ లో ఒక నిజాయితీ గ‌ల కానిస్టేబుల్ ఉద్యోగం ఇస్తేనే తినేశాడు పోసాని. ఇప్పుడు స్పెష‌లిస్టు డైవోర్స్ లాయ‌ర్ అంటే మింగేస్తాడేమో! అనే సందేహం క‌లుగుతోంది.

రెడ్ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. టీజీ కీర్తికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా కె.రాజ‌శేఖ‌ర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.




Tags:    

Similar News