హాట్ ఐట‌మ్ సాంగ్ కాపాడాల్సిందేనా?

Update: 2022-01-04 02:30 GMT
ఐట‌మ్ నంబ‌ర్స్ హీయిల‌కు స‌రికొత్త స్టార్‌డ‌మ్‌ని అందించే బ్ర‌హ్మాస్త్రాలుగా మారుతున్నాయి. ఇంత‌కు ముందు ఐట‌మ్ సాంగ్ ల‌కు ప్ర‌త్యేక‌మైన న‌టులు వుండేవారు కానీ కాలం మారింది. హీరోయిన్ లే ఇప్పుడు ఐట‌మ్ పాప‌లుగా స‌రికొత్త అవ‌తారం ఎత్తేస్తున్నారు. స్టార్ డ‌మ్ కి బ్యాక్‌ డోర్‌గా ఐట‌మ్ సాంగ్స్ మార‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి ఐట‌మ్ సాంగ్స్ పై ప‌డింది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన `జ‌న‌తా గ్యారేజ్‌` చిత్రంలో `ప‌క్కా లోక‌ల్ ..`అంటూ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఐట‌మ్ పాప‌గా ర‌చ్చ చేసి మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

అంతే కాకుండా ఈ సాంగ్ కి భారీ స్థాయిలో పారితోషికాన్ని కూడా సొంతం చేసుకుంది. ఇక పెళ్లి త‌రువాత స్టార్స్ చిత్రాల్లో క‌నిపించ‌ని స‌మంత కూడా ఐట‌మ్ సాంగ్ నే న‌మ్ముకోవాల్సి వ‌చ్చింది. సామ్ తాజాగా ఐట‌మ్ సాంగ్ లో మెస్మ‌రైజ్ చేసిన చిత్రం `పుష్ప : ది రైజ్‌`. విడాకుల ప‌ర్వం త‌రువాత స‌మంత చుట్టూ నెగిటివిటీ పెరిగిపోయింది. నెట్టింట అనునిత్యం అమెని ట్రోల్ చేయ‌డం మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో ఆమెని `పుష్ప‌` ఐట‌మ్ సాంగ్ వ‌రించింది. `ఊ అంటావా మావ‌.. ఊఊ అంటావా..` అంటూ చంద్ర‌బోస్ అందించిన ఈ పాట థియేట‌ర్ల‌లో చేస్తున్న‌ హంగామా అంతా ఇంతా కాదు.

స‌మంత గ్లామ‌ర్ ని ఒలికిస్తూ చేసిన ఈ పాట `పుష్ప` సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌డ‌మే కాకుండా క‌లెక్ష‌న్ ల ప‌రంగానూ ప్ల‌స్ పాయింట్ గా మారింది. అంతే కాకుండా ఈ పాట‌తో సామ్ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. నెట్టింట కూడా సామ్ ఓ రేంజ్ లో వైర‌ల్ అయింది. ఇప్పుడు ఇదే పంథాని అనుస‌రిస్తూ మ‌రో క్రేజీ హీరోయిన్ ఐట‌మ్ నంబ‌ర్ తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ కోసం మెగాస్టార్ తో క‌లిసి రెజీనా స్టెప్పు లేసింది.

దీనికి సంబంధించిన టీజ‌ర్‌ని తాజాగా రిలీజ్ చేశారు. టీజ‌ర్ చూస్తుంటే రెజీనా ఓ రేంజ్‌లో అందాల‌ని ఒలికిస్తూ ర‌చ్చ చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ఒంపు సొంపుల్ని ఎర వేస్తూ న‌డుము మ‌డ‌త‌ల‌ని చూపిస్తూ ఎద అందాల‌తో రెజీనా ఓ రేంజ్ లో రచ్చ చేసిన తీరు టీజ‌ర్ లోనే ఈ రేంజ్ లో వుంటే సినిమాలోని ఫుల్ సాంగ్ లో ఏ రేంజ్ లో అల్లాడించి వుంటుందో అని అప్పుడే హాట్ హాట్ చ‌ర్చ మొద‌లైంది. గ‌త కొంత కాలంగా టాలీవుడ్ లో రెజీనా హ‌వా త‌గ్గిపోయిన విష‌యం తెలిసిందే.

త‌మిళ తెర‌కే ప‌రిమితం అయిన రెజీనా మ‌ళ్లీ టాలీవుడ్ లో ఫామ్ లోకి రావ‌డానికి ప్ర‌ధాన అస్త్రంగా `ఆచార్య‌`లోని `సానా క‌ష్టం... `ని వాడుకుంటున్న‌ట్టుగా తెలుస్తోంది. అందుకే రెజీనా ఇంత వ‌ర‌కు ఏ సినిమాలో చేయ‌ని ఎక్స్ పోజింగ్ ని ఈ పాట‌లో చేసింద‌ని చెబుతున్నారు. విజువ‌ల్స్ చూస్తే ఆ విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఈ ప్రోమో చూసిన వారు రెజీనా హోయ‌ల‌కు క్లీన్ బౌల్డ్ కావాల్సిందే అంటూ కామెంట్ చేస్తున్నారు. రెజీనా అంచ‌నా ఫ‌లించి ఈ పాట‌తో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చేనా అన్న‌ది తెలియాలంటే `ఆచార్య‌` రిలీజ్ అయ్యేంత వ‌ర‌కు వేచి చూడాల్ప‌సిందే.

అన్న‌ట్టు రెజీనా న‌టించిన ఈ పాట ఫుల్ సాంగ్ ని సోమ‌వారం సాయంత్రం 4:05 నిమిషాల‌కు మేక‌ర్స్ రిలీజ్ చేస్తున్నారు. పాట పేలిందా.. రెజీనా ద‌శ తిరిగిన‌ట్టే.. `ఆచార్య‌` లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తుండ‌గా ఆయ‌న‌కు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించింది. రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌గా ఆయ‌న‌కు జంట‌గా బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే.




Tags:    

Similar News